Vijayashanti : చంద్రబాబుపై విజయశాంతి సంచలన కామెంట్స్

Vijayashanti
Vijayashanti : చంద్రబాబుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాదుకు వచ్చారని అందరూ భావించారని వివరించారు. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే టీడీపీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటనే అందుకు నిదర్శనమని విజయశాంతి పేర్కొన్నారు.
తెలంగాణలో టీడీపీ బలపడుతుందని అనడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. తెలంగాణలో టీడీపీ ఎప్పటికీ బలపడదు గానీ, టీడీపీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీతో కలిసి బలపడడానికి కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ గల్లంతయ్యే అవకాశాలు ఉద్యమ తెలంగాణలో ఏర్పడి తీరుతాయని హెచ్చరించారు. అంతేకాదు, సలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బాగున్నదని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు, తెలంగాణలో టీడీపీని తిరిగి బలపరుస్తం అని అనవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు.