Vijayashanti into Congress : సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్ లో చేరనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ వ్యవహారంపై ఆమె గుర్రుగా ఉన్నారు. పార్టీని వీడుతున్నట్లు కొంత కాలంగా హెచ్చిరికలు పంపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు టికెట్ కేటాయించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహాానికి గురైన ఆమె పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె బీజేపీపై అసంతృప్తితో ఉన్నారన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు ఆమెను సీక్రెట్ గా సంప్రదిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నేడో రేపో పార్టీని వీడుతారని టాక్ వినిపిస్తుంది.
1998లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె భారతీయ జనతా పార్టీలో చేరింది. పార్టీ కార్యక్రమాల్లో కొంత కాలం పాల్గొన్న తర్వాత వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొంది. 2005లో ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడింది. ఆ తర్వాత 2009లో తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసింది. దీంతో 2009లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ విజయశాంతిని మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో నిలబెట్టారు. మంచి మెజారిటీతో విజయం సాధించింది. పార్టీ వ్యతిరేకత కార్యక్రమాలు చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో 2013లో పార్టీ నుంచి ఆమెను కేసీఆర్ సస్పెండ్ చేశారు.
ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. అదే సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మెదక్ నుంచి పోటీ చేసింది, కానీ ఈ సారి ఓడిపోయింది. ఆ తర్వాత బీజేపీ మంచి ఊపుమీదున్న సమయంలో 2020లో భారతీయ జనతా పార్టీలోకి వచ్చింది. ఇక 2023లో తనకు టికెట్ ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్న ఆమె మోడీ, అమిత్ షా సభలకు హాజరు కాలేదు. ఇక రేపో, మాపో కాంగ్రెస్ కండువా కప్పుకుంటుందని టాక్ వినిపిస్తుంది.