JAISW News Telugu

Vijayasai : విజయసాయి రెడ్డికి ఆ అధికారి విషయంలో విషమ పరీక్షే !

Vijayasai : విజయసాయిరెడ్డిపై చాలానే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనపై వచ్చినన్ని ఆరోపణలు గతంలో మరెప్పుడూ రాలేదు. తన భార్యకు పుట్టిన పిల్లవాడికి తాను తండ్రిని కాదని విజయసాయి రెడ్డి కారణం కావొచ్చని ఓ అధికారిణి భర్త.. దేవాదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాయడం.. అది బయటకు రావడం సంచలనంగా మారింది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ గా ఉన్న ఓ ఐఏఎస్ అధికారిణిపై వివాదాలున్నాయి. దీంతో ఆమె పెద్దలకు నమ్మకంగా ఉంటూ పని చేస్తూ.. అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు మూటకట్టుకుంది. విజయసాయిరెడ్డే పట్టుబట్టి మరీ ఆమెకు పోస్టింగ్ ఇప్పించారని చెబుతారు. విజయసాయిరెడ్డి ట్వీట్ల కింద గతంలో అనేక కామెంట్లు చేశారు. ఆయనను పొగుడుతూ ఆ ఐఏఎస్ అధికారిణి పెట్టిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కొత్త ప్రభుత్వం వచ్చీ రవడంతోనే సదరు ఐఏఎస్ అధికారిణిని పక్కన పెట్టింది. అదంతా పొలిటికల్, కానీ ఆమె భర్త  సంచలన ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య ప్రెగ్నెంట్ అయ్యిందని. తన భార్య కడుపులో అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని కోరారు. తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్‌ ప్లీడర్‌ సుభాష్‌లే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

ఈ వివాదంపై ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి స్పందించలేదు. లేటు వయసులో ఇలా ఆరోపణలను ఎదుర్కోవాల్సి రావడం సదరు అధికారి భర్తకు కాస్త ఇబ్బందికరమే. మదన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. విషయం సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదు దగ్గరే ఉన్నారు.

Exit mobile version