పది నిమిషాల గ్యాప్ తో వైసీపీకి మరో ఎదురు దెబ్బ!
కీలక రాజకీయ పరిణామంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జనవరి 25, 2025న తన రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతూ తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని లేదా మరే ఇతర అధికారిక పదవిని కొనసాగించనని రెడ్డి స్పష్టం చేశారు. తన రాజీనామా వ్యక్తిగత నిర్ణయమని, తన ఎంపిక వెనుక ఎలాంటి బాహ్య ఒత్తిళ్లు లేదా ప్రభావం లేదని ఆయన ఉద్ఘాటించారు. ఎలాంటి బలవంతం లేకుండా పూర్తిగా తనదే నిర్ణయమని స్పష్టం చేశారు.
ఇలా విజయసాయిరెడ్డి రాజీనామా చేశారో లేదో.. పది నిమిషాల గ్యాప్ తో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీలో నెంబర్ 3 అయోధ్య రామిరెడ్డి ప్రకటించడం పెను సంచలనమైంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అయోధ్య రామిరెడ్డి. వచ్చేవారం రాజ్యసభ సభ్యత్వానికి అయోధ్య రామిరెడ్డి రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం.
దీంతో జగన్ తీరు నచ్చకనే వీరు రాజీనామా చేయబోతున్నారని.. వీరిద్దరూ బీజేపీలో చేరబోతున్నారని సమాచారం. జగన్ ‘సజ్జల’ సహా కోటరీ విజయసాయిరెడ్డి వర్గాన్ని దూరం పెట్టడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది.