Vijayamma : ఇద్దరు బిడ్డల మధ్య ఇమడలేక..అమెరికా వెళ్లిన విజయమ్మ!

Vijayamma

Vijayamma

Vijayamma : ఆంధ్రప్రదేశ్ లో జగన్, తన చెల్లెలు షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకే కుటుంబంలో ఇద్దరు రాజకీయంగా పోటీలో ఉండడంతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.  ఈనేపథ్యంలో ఓటు విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఒకరు వైసీపీ నుంచి మరొకరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఈ సమస్య ముఖ్యంగా కడప ఓటర్లకు ఉంది.

ఇక కడప ఓటర్ల పరిస్థితే ఇలా ఉంటే  తల్లి విజయమ్మ అటు కొడుకుకు చెప్పలేక ఇటు కూతురుతో ఉండలేక సతమతమవుతున్నారు. ఎవరికీ మద్దతు ఇవ్వాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఉండకూడదని నిర్ణయించుకుని అమెరికా వెళ్లిపోయారు. ఎవరికీ చెప్పలేక తనలోనే తానే విచారంలో పడిపోయారు.

కొడుకు ప్రచారం మొదలు పెడితే ఆయన పక్కన నిలిచింది. కూతురు బస్సు యాత్ర ప్రారంభిస్తే ఆమె పక్కన కూడా నిలబడింది. ఇలా ఇద్దరు బిడ్డల మధ్య ఇమడలేక అమెరికా వెళ్లింది. అక్కడ ఎన్నికలయ్యే వరకు ఉండి తరువాత రానున్నట్టు సమాచారం. కన్న బిడ్డలకు ఎలా చెప్పాలో అర్థం కాక దేశం విడిచి వెళ్లిపోయారు. తన బిడ్డలకు ఎవరికీ ఓటు వేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇలా చేసినట్టు తెలుస్తోంది.

కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం దీంతో ఎవరికి చెప్పలేక మధ్యలోనే దేశం విడిచింది. విజయమ్మ తీసుకున్న నిర్ణయం మంచిదేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కూతురు, కొడుకు తలపడుతుండడంతో విజయమ్మ ఇద్దరికీ నచ్చజెప్పలేకపోతోంది. ఏం చేయాలో అర్థం కాక తన దారి తాను చూసుకుంది.

కొడుకు వినడు. కూతురు మాట పట్టించుకోదు. ఇద్దరిలో ఎవరికీ చెప్పినా కష్టమే. అందుకే ఎవరికీ మద్దతు ఇవ్వలేక విజయమ్మ అమెరికా బాట పట్టింది. తెలంగాణలో రాజకీయాలు చేసినప్పుడు షర్మిల వెంటే ఉన్న విజయమ్మ ఇప్పుడు మాత్రం కూతురుతో ఉండలేకపోయింది.

TAGS