Thalapathy Vijay : తమిళనాడు లో ప్రస్తుతం రజినీకాంత్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఇలయథలపతి విజయ్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత 15 ఏళ్ళ నుండి ఆయన సినిమాల బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు చూసుకుంటే ఈ విషయం ప్రతీ ఒక్కరికి అర్థం అవ్వుద్ది.
ఆయన ఫ్లాప్ టాక్ సినిమాలు కూడా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయిపోతున్నాయి అంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘లియో’ చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. ఇంత పెద్ద కాంబినేషన్ సినిమాకి ఇలాంటి టాక్ వచ్చింది, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు వస్తాయో, ఎంత నష్టాన్ని చూస్తామో అని భయపడ్డారు ట్రేడ్ పండితులు మరియు ఫ్యాన్స్.
కానీ విజయ్ స్టార్ పవర్ కారణంగా ఈ సినిమా 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. దీనిని బట్టే చెప్పొచ్చు, తమిళనాడు విజయ్ టైం ఎలా నడుస్తుందో చెప్పడానికి. ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వం లో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు అని చాలా కాలం నుండి సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారం అవుతూ ఉంది. విజయ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అన్నీ విధాలుగా ఏర్పాట్లు చేసుకున్నాడు. క్షేత్ర స్థాయిలో ఉన్న అభిమానులతో ఆయన అనేకసార్లు చర్చలు కూడా జరిపాడు. ఇప్పుడే కాదు, విజయ్ ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో నుండే ఆయనకి కాస్త సామజిక స్పృహ ఎక్కువ ఉండడాన్ని మనం అనేకసార్లు గమనించే ఉంటాం. ఆ సమిజా స్పృహనే ఆయన్ని రాజకీయాల్లోకి అడుగుపెట్టేలా చేస్తుంది. కానీ రీసెంట్ గా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలిసింది ఏమిటంటే, విజయ్ రాజకీయ అరంగేట్రం చెయ్యాలనే ఆలోచనని, ప్రస్తుతానికి దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది.
ఇండస్ట్రీ కి సంబంధించిన ఒక స్టార్ హీరోయిన్ తో ఆయన గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నాడని, ఆమె ఇచ్చిన సలహా మేరకే ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే డైలమా లో పడ్డాడని తెలుస్తుంది. ఆయన తదుపరి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో చెయ్యడానికి సిద్ధం అయ్యాడు. అంటే రాజకీయ ఆలోచన నిజంగానే విరమించుకున్నాడా అని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.