JAISW News Telugu

Vijay Thalapathy : చిన్నతనంలో విజయ్ కుటుంబం కఠిక పేదరికంలో ఉండేది.. కనీసం బాత్రూం కూడా లేదట..!

Vijay Thalapathy

Vijay Thalapathy

Vijay Thalapathy : తమిళ్ ఇండస్ట్రీలో ఇళయ దళపతిగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్. కొన్ని రోజులుగా ఆయన రాజకీయాలపై ఫోకస్ పెడుతూ వస్తున్నారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో వాటిని టార్గెట్ చేస్తూ ‘తమిళగ వెట్రీ కళిగం’ అనే పార్టీని స్థాపించాడు. ఇక దీని కోసమే ఆయన లియో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘కొద్ది రోజులు ఓపిక పట్టండి మనకు మంచి రోజులు వస్తాయి.. మీ కోసం నేను ఏదైనా చేసేందుకు రెడీగా ఉన్నా’ అంటూ ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చాడు.

ఇది ఇలా ఉంటే తను ఈ రోజు సక్సెస్ ఫుల్ హీరోగా కనిపిస్తున్నాడు. కానీ ఆయన ఈ స్థాయికి ఎదిగేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అనేది ఎవరూ పట్టించుకోరు. నిజానికి విజయ్ వాళ్ల నాన్న ఎస్‌ఏ చంద్రశేఖర్ తమిళంలో మంచి దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఆయన కొడుకు విజయ్ కూడా సినిమాల్లోకి వచ్చేందుకు చాలా కష్టపడ్డాడు.

విజయ్ తల్లి శోభ గాయని, తండ్రి చంద్రశేఖర్ డైరెక్టర్ అయినప్పటికీ వీళ్ల కెరియర్ మొదట్లో బాత్రూం కూడా లేని ఇరుకు ఇంట్లో ఉండేవాళ్లు. తల్లి కచేరి చేస్తే వచ్చే డబ్బుతోనే ఇల్లు గడిచేది. తండ్రి దర్శకుడైనా పెద్దగా సక్సెస్ లు లేవు. విజయ్ కాంత్ హీరోగా ‘చట్టం ఒరు ఇరుట్టరై’ అనే సినిమా బాక్సాఫీస్ హిట్ వచ్చింది. అప్పటి నుంచి చంద్రశేఖర్ కెరీర్ లో ముందుకు వెళ్లారు. ఈ మూవీనే చిరంజీవి హీరోగా పెట్టి ‘చట్టానికి కళ్లు లేవు’ అనే పేరు తో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయినా కూడా తన కొడుకు ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ కోరుకోలేదు. డాక్టర్ అయితే బగుంటుందని అనుకున్నాడు. తన చెల్లి విద్య అకాల మరణంతో విజయ్ డిప్రెషన్ లోకి వెళ్లాడు. కోలుకున్న విజయ్ చదువు కొనసాగించాడు. చదువు ఇష్టం లేదని యాక్టర్ అవుతానని తండ్రికి చెప్పడంతో ఆయన ఒప్పుకోలేదు. దీంతో లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రోజంతా వెతికినా దొరకలేదు. చివరగా సినిమా థియేటర్ లో వెతికితే అక్కడ కనిపించాడు.

తన కొడుకు పట్టువదలడని గ్రహించిన చంద్రశేఖర్ చదువు కంప్లీట్ చేసిన తర్వాత సినిమాల్లోకి రావచ్చని డిగ్రీలో చేరాలని సూచించారు. ఆయన తండ్రి కోరిక మేరకు సినిమాకు అనుబంధంగా ఉండే డిగ్రీ అయిన ‘విజువల్ కమ్యునికేషన్’లో చేరాడు. డిగ్రీ కంప్లీట్ కాగానే విజయ్ ఫొటో షూట్ చేసుకొని ఆ ఫొటోలతో డైరెక్టర్లను కలిసి తనకు అవకాశాలు ఇవ్వాలని కోరాడు. విజయ్ తండ్రి కూడా క్లాస్ డైరెక్టర్లను కలిసి తన కొడుకుకు అవకాశం ఇవ్వాలని ఆయనతో సినిమాతో చేస్తే సగం బడ్జెట్ పెడతానని కోరినా ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు.

దీంతో తండ్రీ కొడుకులు రూ. 60 లక్షలు అప్పు చేసి ‘నాలయ తీర్పు’ అనే సినిమా చేశారు. ఈ మూవీ భారీ డిజాస్టర్ అవడంతో నష్టపోయారు. దీనికి తోడుగా ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కావడంతో అదే రోజు మీడియా వాళ్లు చీల్చి చెండాడారు. విజయ్ కు యాక్టింగ్ రాదు.. తండ్రి డైరెక్టర్ అయినంత మాత్రాన కొడుకు హీరో కావచ్చు అనుకోవడం మూర్ఖత్వం అంటూ రాశారు. ఈ రాతలతో విజయ్ మనస్తాపం చెందాడు. తన స్నేహితులు ఓదార్చడంతో బయటపడ్డ ఆయన సెకండ్ మూవీగా ‘సెంధూర పాండి’ చేశాడు.

తన అభిమాని సంగీతను వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు జేసన్ యూట్యూబ్ లో వీడియో జాకీగా కనిపిస్తూనే ఉంటాడు. తన కూతురుకు విజయ్ చెల్లి పేరు కలిసేలా దివ్య అని పెట్టాడు. ఆమె కూడా బ్యాడ్మింటన్ లో ప్రతిభ చూపిస్తుంది. ఇన్ని రోజులు విజయ్ ని హీరో గా చూసిన మనం రాను రాను పొలిటీషియన్ గా కూడా చూడబోతామేమే వేచి చూడాలి.

Exit mobile version