Vijay-Rashmika Engagement : విజయ్ దేవరకొండ-రష్మిక నిశ్చితార్ధ తేదీ ఖరారు.. ఆహ్వానం కేవలం వారికైనా?
Vijay-Rashmika Engagement : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ రేంజ్ కి ఎదిగిన వారిలో విజయ్ దేవరకొండ మరియు రష్మిక కచ్చితంగా ఉంటారు. ఈ ఇద్దరికీ యూత్ లో అమితంగా క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం ‘గీతా గోవిందం’. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే రష్మిక తన మాజీ ప్రియుడు , కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి తో నిశ్చితార్థం బ్రేక్ చేసుకుంది.
ఆ తర్వాత ఆమె చాలా బాదపడినట్టు, ఆ సమయం లో విజయ్ దేవరకొండ ఆమెకి అండగా నిలబడి, ఆమె బాధని పంచుకున్నట్టు, ఆ తర్వాత ఇద్దరు మంచి స్నేహితులై, తర్వాత ప్రేమికులై, గత కొంతకాలం నుండి డేటింగ్ చేసుకుంటున్నారు అని సోషల్ మీడియా లో ఎప్పటి నుండో ఒక టాక్ ప్రచారం అవుతూనే ఉంది. వీళ్లిద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండడం, కలిసి టూర్లకు తిరగడం, ఇలాంటివన్నీ నెటిజెన్స్ చూసారు. కానీ ఎందుకో వీళ్లిద్దరు ఇప్పటి వరకు తమ రిలేషన్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.
బహుశా దిష్టి తగులుతుందేమో అనే భయంతోనే ఇన్ని రోజులు వీళ్లిద్దరి రిలేషన్ పై ఎలాంటి ప్రకటన చెయ్యలేదని అనుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే అతి త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి జరగబోతున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఫిబ్రవరి రెండవ వారం లో వీళ్లిద్దరి నిశ్చితార్థం జరుగుతుందని, ఈ నిశ్చితార్థం కూడా మీడియా కి తెలియకుండా సీక్రెట్ గా చేసుకుంటే బాగుంటుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడట. ఎందుకంటే రష్మిక కి నిశ్చితార్థం అసలు కలిసి రావడం లేదు. గతం లో కూడా రక్షిత్ శెట్టి తో నిశ్చితార్థం చేసుకున్న తర్వాతనే బ్రేకప్ అయ్యింది. అందుకే పెద్దగా ప్రచారం లేకుండా, గోప్యంగా నిశ్చితార్థం చేసుకొని, పెళ్లి ముహూర్తం మాత్రం బహిరంగంగా సోషల్ మీడియా లో తెలపాలనే ఆలోచనలో విజయ్ దేవరకొండ ఉన్నట్టు తెలుస్తుంది.
రష్మిక కూడా అందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. ఇకపోతే వీళ్లిద్దరి కెరీర్ విషయానికి వస్తే రష్మిక రీసెంట్ గానే ‘ఎనిమల్’ చిత్రం తో బాలీవుడ్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం చెయ్యబోతుంది. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ పెట్ల తో ‘ఫ్యామిలీ స్టార్’ అనే చిత్రం చేస్తున్నందుకు. ఈ సినిమా వచ్చే నెల 18 వ తారీఖున విడుదల అవ్వబోతున్నట్టు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.