Vijay Deverakonda : కన్నడ ముద్దుగుమ్మతో విజయ్ దేవరకొండ రొమాన్స్.. ఆమె అందం చూస్తే సర్‌ప్రైజ్ అవడం ఖాయం
Vijay Deverakonda : ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ కాలంలోనే భారీ స్టార్ డం సంపాదంచుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డికి ముందు చిన్న చిన్న పాత్రలు వేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగిన ఆయన అర్జున్ రెడ్డి తర్వాత భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. తనదైన శైలిలో చిత్రాలు చేస్తూ వెళ్తున్నాడు. లైగర్ తో తన సక్సెస్ కు కొంచెం బ్రేకులు పడ్డాయి. ఈ మూవీ భారీ డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత వచ్చిన ఖుషి కూడా అంతగా ఆడలేదు. దీంతో ఈ మధ్య దేవరకొండ సరైన సక్సెస్‌ను చూడడం లేదు. చాలా కాలంగా బాక్సాఫీస్ హిట్ కు దూరంగా ఉన్న రౌడీ బాయ్. ఈ సారి సక్సెస్ కొట్టాల్సిందేనని పట్టుదలతో ఉన్నాడు. అందుకే ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది.
తిన్ననూరితో మూవీ చేస్తుండగానే మరో ప్రాజెక్టుపై సంతకం చేశాడు. ఈ విషయాన్ని విజయ్ అనౌన్స్ కూడా చేశారు. దీన్ని ‘రాజా వారు రాణి గారు’ ఫేం రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్’పై శిరీష్ తో కలిసి నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలిపారు. విజయ్ దేవరకొండ – రవి కిరణ్ కోలా కాంబోలో రాబోయే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అంచనాలు బాగానే ఉన్నాయి. అంచనాలకు అందుకునేందుకే భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ మూవీకి చాలా సమయం ఉండడంతో క్రూ ఎంపిక మొదలెట్టారు. ఇందులో భాగంగా హీరోయిన్ ఎవరిని తీసుకుంటున్న న్యూస్ లీకైంది.
విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా తెరకెక్కించే ఈ మూవీలో హీరోయిన్‌గా కన్నడ పిల్ల రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తుందని మొదట టాక్ వచ్చింది. కానీ, ఆమె బాలీవుడ్ రామాయణం తదితర ప్రాజెక్టులలో బిజీగా ఉండడంతో రుక్మిణిని తీసుకున్నారని సమాచారం. ఈ వార్త తెలిసిన తర్వాత ఈ హీరోయిన్ గురించి రౌడీ బాయ్ ఫ్యాన్స్ ఎంక్వైరీ చేస్తున్నారు. అలా ఆమె అందాన్ని చూసి సర్‌ప్రైజ్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. విజయ్, రవికిరణ్ కోలా చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఇది పూర్తయిన వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలుపెడతారని తెలుస్తోంది. ఇందులో తారాగణం, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది.