Vijay Devarakonda : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే యూత్ లో స్టార్ హీరోకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. వరుస హిట్స్ తో ఒక్కసారిగా టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన ఈ కుర్ర హీరోకి ఈమధ్య కాలం కలిసి రావడం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆయన పాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
ఈ సినిమా తర్వాత ఆయన కొంతకాలం గ్యాప్ తీసుకొని చేసిన ‘ఖుషి’ చిత్రం కూడా గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై యావేరేజి మూవీ గా నిల్చింది. ఈ రెండు సినిమాల ఫలితాలు విజయ్ దేవరకొండ ని బాగా కృంగదీసాయి. కానీ ఖుషి చిత్రం మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఆడడమే కాకుండా, అందులోని పాటలు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికీ ఈ పాటలు ప్రతీ చోట వినిపిస్తూనే ఉంటుంది.
అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ కి అర్జెంటు గా ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. ఎలాంటిది అంటే ఒక ‘అర్జున్ రెడ్డి’, ఒక ‘గీత గోవిందం’ రేంజ్ అన్నమాట. అందుకే ఆయన ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్ పెట్ల తో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది విడుదలైన ఈ మూవీ టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ టీజర్ లోని ‘ఐరన్ ని వంచాలా ఏందీ’ అనే డైలాగ్ సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయ్యింది. ఇదంతపక్కన పెడితే ఈ సినిమాని ముందుగా ఫిబ్రవరి 18 వ తారీఖున విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండడం తో ఇంకా కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమాని ఏప్రిల్ నెలలో విడుదల చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం తో ఉన్నారట మేకర్స్.
దేవర సినిమా ఏప్రిల్ 4 వ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఆ డేట్ లో ఫ్యామిలీ స్టార్ ని విడుదల చెయ్యాలని చూస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఎన్టీఆర్ నిర్ణయం పైనే దేవర చిత్రం విడుదల అవుతుందా లేదా వాయిదా పడుతుందా అనేది ఆధారపడి ఉంటుందట, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ టీం కూడా దేవర టీం ఇచ్చే విడుదల తేదీ కోసం ఆతృతగా ఎదురు చూస్తుందట.