JAISW News Telugu

Vijay Devarakonda : పెళ్లిపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు..ఫ్యామిలీ స్టార్ మదిలో ఉన్న భామ ఆమేనా?..

Vijay Devarakonda

Vijay Devarakonda

Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు యూత్ లో ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాల హిట్ తో విజయ్ రేంజ్ దేశవ్యాప్తమైందనే చెప్పాలి. ఆ తర్వాత విజయ్ సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అలాగే ఉంది. బాలీవుడ్ హీరోయిన్లకు అతడంటే క్రష్ అనే చెప్పాలి. చాలా మంది హీరోయిన్లు విజయ్ తో నటించాలనే కోరికను మీడియా ఎదుట చెబుతుంటారు. విజయ్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఖుషీ యావరేజ్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత వస్తున్న ఫ్యామిలీ స్టార్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

‘ఫ్యామిలీ స్టార్’ తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాడు విజయ్ దేవరకొండ. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 5న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. తన సినిమా విశేషాలు, పెళ్లి ముచ్చట్లు పంచుకున్నారు. తనకు కూడా పెళ్లి చేసుకోవాలని, తండ్రిని కావాలని ఉందని, కాకపోతే ఇప్పుడే చేసుకోనన్నారు. ప్రేమ వివాహమే చేసుకుంటానని, తన తల్లిదండ్రులకు ఆ అమ్మాయి తప్పక నచ్చాలని చెప్పుకొచ్చాడు.

కొంతమంది తమిళ దర్శకులు తనకు కథలు చెప్పారని, అందులో కొన్ని త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయని తెలిపారు. గౌతమ తిన్ననూరితో తాను చేయబోయే సినిమాలో చాలా మంది కోలీవుడ్ నటీనటులు భాగం కానున్నారని విజయ్ పేర్కొన్నారు. ‘‘యూనివర్సల్ కంటెంట్ తో ‘ఫ్యామిలీస్టార్’ రూపుదిద్దుకుంది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఏప్రిల్ 5న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నాం. రెండు వారాల తర్వాత హిందీ, మలయాళంలో రిలీజ్ చేయనున్నాం. తమిళనాడులో 250 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇటీవల సెన్సార్ పూర్తైంది. దీని రన్ టైమ్ 2.40 గంటలు. నాలుగు ఫైట్స్ ఉన్నాయి. ఆ కారణంతోనే యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.’’ అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

‘గీత గోవిందం’ తర్వాత పరుశురామ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మృణల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, విజయ్ దేవరకొండ ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడంతో నెట్టింట ఒకటే చర్చ నడుస్తోంది. ఎక్కువ మంది రష్మిక మంధన్న అయి ఉండొచ్చు అని .. మరి కొందరు వేరే వ్యక్తి అయి ఉండొచ్చు అని తమ ఊహలకు పనిచెబుతున్నారు.

Exit mobile version