JAISW News Telugu

Vijay Devarakonda : మాస్ సినిమా అంటేనే పారిపోతున్న విజయ్ దేవరకొండ..’లైగర్’ ఎఫెక్ట్ మామూలుగా పడలేదుగా!

Vijay Devarakonda

Vijay Devarakonda

Vijay Devarakonda : ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చి అతి తక్కువ సమయం లోనే యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకునేం హీరో విజయ్ దేవరకొండ. ఈయన ఎక్కువగా యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ ద్వారానే మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆయన మాస్ ఆడియన్స్ కి దగ్గర అయ్యేందుకు పూరి జగన్నాథ్ తో కలిసి చేసిన ‘లైగర్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఈ సినిమా దెబ్బకి మళ్ళీ ఆయన మాస్ జానర్ స్టోరీల వైపు కనెత్తి కూడా చూడకూడదు అని ఫిక్స్ అయ్యినట్టు రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన చూస్తే అర్థం అవుతుంది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఆయన గీత ఆర్ట్స్ బ్యానర్ లో ‘గీతా గోవిందం’ అనే చిత్రం చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. సినిమా తర్వాత వెంటనే మళ్ళీ గీత ఆర్ట్స్ తోనే సినిమా చేస్తానని ఒప్పందం కుదిరించుకున్నాడు విజయ్ దేవరకొండ.

కానీ గీతా ఆర్ట్స్ దగ్గర అప్పటికే కథ సిద్ధం కాకపోవడం తో వేరే ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. అలా బిజీ అయిపోయిన విజయ్ దేవరకొండ కి పరశురామ్ పెట్ల ‘ఫ్యామిలీ స్టార్’ కథని చెప్పాడు. ఆయనకీ బాగా నచ్చడం తో వెంటనే ఓకే చెప్పేసాడు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కాలి, కానీ అది దిల్ రాజు చేతికి వెళ్ళింది. అల్లు అరవింద్ దీనిపై చాలా ఫైర్ అయ్యి పెద్ద రచ్చ చెయ్యాలని అనుకున్నాడు. కానీ దిల్ రాజు ఇంటర్నల్ గా మాట్లాడి సమస్యని పరిష్కారం చేసుకున్నాడు. ఇక్కడితో ఈ మ్యాటర్ క్లియర్ అయ్యింది. అయితే గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఎప్పటికైనా విజయ్ దేవరకొండ ఒక సినిమా చెయ్యాలి. ఎందుకంటే గీత ఆర్ట్స్ ఇచ్చిన అడ్వాన్స్ ఇంకా ఆయనతోనే ఉంది. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా పూర్తి అవ్వగానే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించే సినిమాకి షిఫ్ట్ అవుతాడు.

ఈ చిత్రం పూర్తి అవ్వగానే గీతా ఆర్ట్స్ మూవీ కి షిఫ్ట్ అవుతాడు. అయితే రీసెంట్ గానే బోయపాటి శ్రీను గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన జరిగిన సంగతి తెలిసిందే. బోయపాటి దగ్గర ఉన్న స్క్రిప్ట్ ని విజయ్ దేవరకొండ కి వినిపించారట. కానీ విజయ్ మాత్రం ఇంత మాస్ సినిమా మనకి ఎందుకు, నేను మాస్ సినిమాలు చెయ్యను అని రిజెక్ట్ చేసాడట. దీంతో ఈయన ఇప్పట్లో మాస్ జోలికి వెళ్లే ప్రయత్నం చేసేటట్టు లేడని అనిపిస్తుంది.

Exit mobile version