Vijay Devarakonda : నేనే అర్జునుడిని.. ప్రభాస్ కర్ణుడు.. అశ్వినిదత్ ఏదీ చెబితే అదే కరెక్ట్

Vijay Devarakonda

Vijay Devarakonda

Vijay Devarakonda : కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27 న రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. విజువల్ వండర్ అంటూ ప్రేక్షకులు మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ  వైజయంతీ మూవీస్ లో అశ్వినీదత్ నిర్మించారు. అశ్వినీ దత్ నిర్మించిన ఈ మూవీలో అనేక మంది స్టార్లు నటించారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ చేయగా.. స్వప్న దత్ సహకరించారు. ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే 415 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టినట్లు నాగ్ అశ్విన్ తెలిపాడు. దీంతో వరల్డ్ వైడ్ గా ఎంత పెద్ద హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

నాగ్ అశ్విన్ మహానటి, కల్కి మూవీల్లో విజయ్ దేవరకొండకు చాన్స్ ఇచ్చారు. కల్కి మూవీలో ఏకంగా అర్జునుడి పాత్రను విజయ్ దేవరకొండకు ఇవ్వడం విశేషం. అయితే ఈ క్యారెక్టర్ పై విజయ్ దేవరకొండ స్పందించాడు. నాగ్ అశ్విన్ యూనివర్సల్ లో మేం పాత్రలు చేస్తున్నాం. ఆయన సృష్టిస్తున్న ఈ ప్రపంచం అంతా ఇంతా కాదు. వేరే లెవల్. అంత గొప్ప ఆలోచనలో మేం కూడా చిన్న పాత్రదారులు కావడం సంతోషంగా అన్నారు.

సినిమాలో నన్ను విజయ్ దేవరకొండగా, ప్రభాస్ గా చూడొద్దు, నన్ను అర్జునుడిగా, ప్రభాస్ ను కర్ణుడిగా మాత్రమే చూడాలని చెబుతున్నా.. ఎందుకంటే సినిమాలో క్యారెక్టర్ పరంగా చూస్తేనే దానికి కిక్కు వస్తుంది. అంతే కానీ హిరో పేర్ల  తో చూడకండని అభిమానులకు సలహా ఇచ్చారు. నాగ్ అశ్విన్ ప్రపంచంలో మేమంతా ఒక పాత్రలం మాత్రమే అన్నారు.

కల్కి 2 మూవీలో విజయ్ దేవరకొండ పాత్ర ఎక్కువ గా ఉంటుందని నిర్మాత నాగ్ అశ్విన్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ అశ్వినీ దత్ చెప్పింది కరెక్టే. ఆయన ఏదీ చెబితే అదే రైట్ అంటూ తన క్యారెక్టర్ కల్కి 2 లో ఎలా ఉండబోతుందో రివీల్ చేశాడు.

TAGS