Yogi Adityanath Video : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలో జరిగిన ‘నో యువర్ ఆర్మీ’ ఫెస్టివల్‌లో తుపాకీలను పట్టుకొని పేల్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అచ్చం ఆర్మీ మ్యాన్ లాగా కాల్పులు జరిపారు. మూడు రోజుల ఈవెంట్ లో భారత సైన్యం ట్యాంకులు , ఆర్టిలరీ గన్‌లతో సహా వివిధ ఆధునిక ఆయుధాలను ప్రదర్శించారు.
लखनऊ में आज से आयोजित तीन दिवसीय ‘Know Your Army Festival-2024’ के उद्घाटन कार्यक्रम में सम्मिलित हुआ।
इस समारोह के माध्यम से हमारे युवाओं को भारतीय सेना को जानने और उनके शौर्य व पराक्रम से साक्षात्कार का अवसर प्राप्त होगा।
इस समारोह के लिए भारतीय सेना को हृदय से बधाई! pic.twitter.com/Pp1ECo28pN
— Yogi Adityanath (@myogiadityanath) January 5, 2024
ఈ ఈవెంట్ యొక్క ఫొటోలను యోగి తన ట్విట్టర్ లో పంచుకున్నారు. ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ‘యువతకు భారతీయ సైన్యం గురించి తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం అని అన్నారు. “ఈరోజు నుండి లక్నోలో నిర్వహిస్తున్న మూడు రోజుల ‘నో యువర్ ఆర్మీ ఫెస్టివల్-2024’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని… ఈ వేడుక ద్వారా మన యువతకు భారత సైన్యం గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. వారి ధైర్యసాహసాలు.. పరాక్రమాలను కలుసుకుంటారని… ఈ వేడుకకు వచ్చిన భారత సైన్యానికి హృదయపూర్వక అభినందనలు ” అని యోగి ట్వీట్ చేశారు.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath inaugurates ‘Know Your Army Festival’ in Lucknow. pic.twitter.com/qnacC3iG9W
— ANI (@ANI) January 5, 2024
ఈ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ రైఫిల్‌ను తనిఖీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో 51 ఏళ్ల యోగి తుపాకీ పట్టుకొని లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకుంటూ కాల్చినట్టుగా చూపించారు.
— Yogi Adityanath (@myogiadityanath) January 5, 2024
జనవరి 15న లక్నోలో జరిగే ఆర్మీ డే పరేడ్‌కు ముందస్తుగా ‘నో యువర్ ఆర్మీ’ ఫెస్టివల్ జరుగుతోంది. న్యూఢిల్లీ వెలుపల ఈ కార్యక్రమం నిర్వహించడం ఇది రెండోసారి.
గత సంవత్సరం భారతదేశంలోని వివిధ నగరాల్లో ఆర్మీ డే పరేడ్ వేదికను నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈవెంట్ యొక్క వైభవాన్ని చూడటానికి వివిధ ప్రాంతాల ప్రజలను అనుమతించడం దీని లక్ష్యం అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ఈవెంట్ దేశ రక్షణలో ప్రత్యేకమైన.. కీలక పాత్ర పోషిస్తుందని, ఇది విభిన్న సాంస్కృతిక మరియు ప్రాంతీయతను హైలైట్ చేసే అవకాశాన్ని కూడా అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు.