Video : ఆడపిల్లలపై అమానుష దాడి.. ఈ మానవమృగాన్ని వెతకండి..
Video : ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఆడపిల్లలపై జరిగిన అమానుష దాడికి సంబంధించిన షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు. ఎందుకంటే ఆ బాలికలు ఇద్దరూ ఏపీ ప్రభుత్వానికి చెందిన యూనిఫామ్ ధరించి ఉండటంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాళ్లకి న్యాయం చేయాలంటూ, నిందితుడిని పట్టుకునేందుకు సహాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఇద్దరు స్కూలు బాలికలు తీవ్ర ఆవేదనతో వ్యక్తి చేతుల్లో తన్నులు తింటున్నారు. ఈ మానవ మృగం ఎక్కడ ఉన్నాడని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడిన వ్యక్తి భూమ్మీద బతికే అర్హత లేదని అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలను ఇలా హింసించే రాక్షసుడిని పట్టుకుని చట్టానికి అప్పగించే వరకు వీడియోను షేర్ చేయాలని ప్రజలను వేడుకుంటున్నారు.
ఎన్నో వార్తలు చూస్తాం, ఎన్నో విషయాలు చదువుతాం కానీ ఇలాంటి ఘటనలపై మానవత్వంతో స్పందించాలని అందరూ కోరుతున్నారు.. ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె గుర్తు చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కడో తలదాచుకుని ఉండవచ్చని, ప్రయత్నిస్తే ఎలాంటి డొంకలోనైనా దాక్కున్నా పట్టుకోగలమని పిలుపునిస్తున్నరు.
ఈ వీడియోను చూసి వదిలేయకుండా తమ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు చేరేలా షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, నిందితుడిని గుర్తించడంలో సహాయం చేయాలని కోరుతున్నారు.
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒక వ్యక్తి ఇలాంటి దారుణానికి పాల్పడటం అత్యంత బాధాకరం. ఈ మానవ మృగాన్ని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దయచేసి ఈ సమాచారాన్ని మీ పరిధిలోని వారికి షేర్ చేసి, నిందితుడిని గుర్తించడంలో సహాయం చేయండి.బాలికలకు న్యాయం జరిగేలా మనవంతు ప్రయత్నం చేద్దాం.