Venkatesh Daughter Wedding : పెళ్లికళ వచ్చేసిందే బాల.. వెంకీ మామ ఇంటా మోగనున్న పెళ్లి బాజా..

Venkatesh Daughter Hayavahini Pre Wedding
Venkatesh Daughter Wedding : టాలీవుడ్ కు పెళ్లికళ వచ్చేసింది. మొన్న వరుణ్ తేజ్, తావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కగా, నిన్ననే కుర్ర హీరో కిరణ్ అబ్బవరం..నటి రహస్య తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వెంకీ మామకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, ప్రస్తుతం రెండో కుమార్తె హయవాహిని ఎంగేజ్ మెంట్ గతేడాది అక్టోబర్ లో జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తో హయవాహిని ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ వేడుక చాలా సింపుల్ గా నిర్వహించారు.

Venkatesh Daughter Wedding
ఇక ఇప్పుడు పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యిందని తెలిసింది. ఈ నెల 15న ఈ వివాహం జరుగనుంది. కాగా, ప్రీవెడ్డింగ్ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారని తెలుస్తోంది. ఈ వేడుకలో వెంకటేశ్ తో కలిసి రఘురామకృష్ణంరాజు ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మిగతా ఫొటోలు బయటకు రావాల్సి ఉంది.
హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వెంకటేశ్ రెండో కూతురు హయవాహిని వివాహం జరుగనుంది. ఈవేడుకకు కొద్దిమంది టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల మధ్య ఈ వేడుక జరుగనుంది. వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం 2018లో జైపూర్ లో ఘనంగా చేశారు.