BAN Vs AFG : బంగ్లాపై విజయం.. సెమీస్ కు చేరిన అఫ్గానిస్తాన్

BAN Vs AFG

BAN Vs AFG

BAN Vs AFG : బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించి టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. సెమీస్ చేరిన అఫ్గానిస్తాన్ జట్టు చరిత్ర సృష్టించింది.

చిన్న జట్టుగా బరిలోకి దిగిన అఫ్గాన్ ఇప్పటికే గ్రూపు స్టేజీలో న్యూజిలాండ్ ను ఓడించింది. సూపర్ 8 లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి.. సంచలనం నమోదు చేసింది. సెమీస్ చేరాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో బంగ్లాపై గెలిచి మొదటి సారి ఐసీసీ టోర్నీల్లో టీ 20 వరల్డ్ కప్ సెమీస్ కు చేరింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ బ్యాటర్లు తడబడ్డారు. పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుండటంతో ఆచితూచి ఆడారు. గుర్బాజ్ (43) మరోసారి బ్యాటింగ్ లో రాణించినా బాగా స్లోగా ఆడటంతో స్కోరు బోర్డు పై ఎక్కువ పరుగులు కాలేవు. చివర్లో రషీద్ ఖాన్ మూడు సిక్సులు కొట్టడంతో అఫ్గాన్ చివరకు 115/5 తో ఇన్సింగ్స్ ముగించింది. బంగ్లా బౌలర్లలో రిషద్ హోసెన్ మూడు వికెట్లతో రాణించాడు.

అనంతరం ఛేదనకు దిగిన బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ లిటన్ దాస్ ఒక్కడే 54 పరుగులతో రాణించాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన మ్యాచ్ ను గెలిపించలేకపోయాడు. మరో ఎండ్ లో బంగ్లా బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెనుదిరగడంతో బంగ్లా కు ఓటమి తప్పలేదు. దీంతో అఫ్గాన్ సెమీస్ కు చేరగా.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ కూడా ఇంటి బాట పట్టింది. ఒకే మ్యాచ్ లో మూడు టీంలు సెమీస్ కోసం పోరాడటంతో మ్యాచ్ ఆసక్తిగా మారింది. 12.1 ఓవర్ లో మ్యాచ్ గెలిస్తే బంగ్లా కూడా సెమీస్ చేరేదే. కానీ వచ్చినా అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. అఫ్గాన్ విజయంతో ప్లేయర్లు సపోర్టు స్టాప్ సంబరాల్లో మునిగిపోయారు.  

TAGS