SSC Marks : పదో తరగతి అనేది ప్రతి విద్యార్థి జీవితంలోనూ ఓ ముఖ్యమైన దశ. బంగారు భవిష్యత్తుకు అడుగులు పడేది అప్పటి నుంచే. టెన్త్ క్లాసులో వచ్చే మార్కులే విద్యార్థి భవితను నిర్దేశిస్తాయి. టీచర్లు కూడా పదో తరగతిలో చాలా కష్టపడి చదవాలంటూ తమ స్టూడెంట్లను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆ విద్యార్థి కూడా అలాగే చదివాడు. మంచి మార్కులు తెచ్చుకోవాలన్న పట్టుదలతో కష్టపడ్డాడు. కానీ ఫలితాలు వచ్చాక.. వచ్చిన మార్కులు చూసి షాక్ అయ్యాడు. అన్ని సబ్జెక్టులలో 90 శాతానికి మార్కులు సంపాందించుకున్న ఆ విద్యార్థకి హిందీలో మాత్రం 35మార్కులే వచ్చాయి. దీంతో విద్యార్థితో పాటు, అతని తల్లిదండ్రులు, టీచర్లు కూడా షాక్ తిన్నారు. అయితే రీవెరిఫికేషన్ చేయిస్తే.. తాజాగా 89 మార్కులు వచ్చినట్లు తేలింది. దీంతో పేపర్ వాల్యుయేషన్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చిత్తూరు జిల్లాకు చెందని ఉర్జిత్ అనే విద్యార్థి ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాశాడు. ఇటీవల వెల్లడైన ఫలితాల్లో అన్ని సబ్జెక్టులలో 90 వరకూ మార్కులు సంపాదించుకున్నాడు. ఇంగ్లీషులో 98, తెలుగులో 95, హిందీలో 89, గణితంలో 92, సైన్స్‌లో 90, సోషల్‌లో 85 మార్కులు రాగా.. హిందీలో మాత్రం 35 మార్కులే వచ్చాయి. దీంతో విద్యార్థితో పాటు అతని కుటుంబం, ఉపాధ్యాయులు షాక్ తిన్నారు. ఉర్జిత్ బాగా చదివే విద్యార్థి కావటంతో ఉపాధ్యాయులు అతనితో రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయించారు. రీవెరిఫికేషన్ చేసిన అధికారులు.. పేపర్లు దిద్దటంతో తప్పు జరిగినట్లు గుర్తించారు. 89 మార్కులు వస్తే 35 మార్కులు తప్పుగా వేసినట్లు గుర్తించారు. తప్పును సరిదిద్ది 89 మార్కులు వచ్చినట్లు మార్కుల మెమోను పంపారు.
పేపర్లు దిద్దడంతో ఇలా తప్పిదాలు చేస్తూ పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులను క్షోభ పెట్టడం సమంజసం కాదని విశ్లేషకులు సూచిస్తున్నారు. మనసు ఎక్కడో పెట్టి పేపర్లు దిద్దడం ఏంటని అంటున్నారు. తాము బాగానే పరీక్షలు రాసినా ఫెయిల్ కావడంతో
మనస్తాపం చెందిన విద్యార్థులు ఏదైనా ఆఘాయిత్యానికి పాల్పడితే ఎవరిది బాధ్యతా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులపై ఉందని సూచిస్తున్నారు.