Venu Swamy : వేణు స్వామి పని అయిపోయిందా.. ఆయనపై మహిళా కమిషన్ కు కంప్లయింట్
Venu Swamy : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరో హీరోయిన్లు సెలబ్రిటీల లైఫ్ గురించి వారి జాతకాల గురించి వేణు స్వామి కామెంట్స్ చేస్తూ ఉంటాడు. వారి పేర్లను బట్టి జాతకాలు చెబుతూ వారు కలిసి ఉంటారా విడిపోతారా అతడి సినిమా సక్సెస్ అవుతుందా, లైఫ్ లో పెద్ద హీరో అవుతాడా లేదా అనే విషయాలను బహిరంగంగా సోషల్ మీడియాలో చెబుతూ ఉంటాడు.
ఈ విధంగా గతంలో సమంత నాగచైతన్య నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువగా కలిసి ఉండరని చెప్పాడు. అదేవిధంగా నాలుగు సంవత్సరాల తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఇప్పుడు నాగచైతన్య శోభిత ధూళిపాల అనే హీరోయిన్ తో ప్రేమలో పడి తాజాగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. కాగా మళ్లీ జ్యోతిష్యం చెప్పడానికి ముందుకు వచ్చిన వేణు స్వామి సోషల్ మీడియాలో శోభిత నాగచైతన్య రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా కలిసి ఉండరు అని బాంబు పేల్చాడు.
దీంతో వేణు స్వామి పై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. మంచి మాటలు మాట్లాడార అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నీ నోటికి అడ్డు అదుపు లేదా అంటూ విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. పెళ్లి చేసుకొని సంతోషంగా స్థిరపడాలనుకుంటున్నటువంటి ఒక జంటపై నెగటివ్ కామెంట్స్ చేసి ఏం బాగుపడతావు అంటూ తిట్టిపోస్తున్నారు.
అయితే తెలుగు ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ తెలుగు ఫిలిం డిజిటల్ అసోసియేషన్ రెండు కలిపి ఇలా కమిషన్ దగ్గరకు వెళ్లి కంప్లైంట్ చేశారు. వేణు స్వామి పై చర్యలు తీసుకోవాలని సెలబ్రిటీల హీరోల హీరోయిన్ల వ్యక్తిగత లైఫ్ లోకి వెళ్లి వారి జీవితాలను ఇబ్బంది పెట్టే విధంగా జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో దాని పోస్ట్ చేస్తున్నారని దీంతో వారు మానసికంగా ఎంతో కృంగిపోయి తీవ్ర ఇబ్బందులకు ఎదురవుతున్నాయని కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ సేకరించిన మహిళ కమిషన్ వేణు స్వామిని పిలిపించి మాట్లాడే అవకాశం ఉంది. ఇలాంటివి చేయకుండా ఉండాలని హెచ్చరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.