Venu Swamy : వేణు స్వామి భారీ షాక్.. ఈ సారి అరెస్టు ఖాయమేనా?
Venu Swamy
కాగా వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు పంపడం ఇది రెండోసారి కావడం గమనార్హం. వేణు స్వామి చేసిన వ్యాఖ్యలపై గతంలో నోటీసులు పంపగా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీనిపై వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆ స్టేను హై కోర్టు ఎత్తివేసింది. మహిళా కమిషన్ కు నోటీసులు జారీ చేసే అధికారం ఉందని తీర్పులో స్పష్టం చేసింది హైకోర్టు. దీంతో వేణు స్వామికి చేసిన మహిళా కమిషన్ రెండో సారి నోటీసలు జారీ చేసింది. ఈ నెల 14న తప్పకుండా విచారణకు హాజరవ్వాలని కమిషన్ ఆదేశించింది. మరి ఈసారైనా వేణు స్వామి కమిషన్ చేపట్టే విచారణకు హాజరవుతాడో? లేదో? వేచి చూడాల్సిందే.
కాగా ఈ ఏడాది ఆగస్టులో హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నాగచైతన్య-శోభితల నిశ్చితార్థం విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు హీరో అక్కినేని నాగార్జున. అయితే ఈ నిశ్చితార్థం మెంట్ జరిగిన రెండో రోజులకే ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి వీరిపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
గతంలో సమంత – చైతన్య విడిపోయినట్లే నాగచైతన్య – శోభిత కూడా విడాకులు తీసుకోవడం ఖాయనని వేణు స్వామి జోస్యం చెప్పాడు. వేణు స్వామి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దీంతో అక్కినేని అభిమానులు వేణు స్వామిపై మండిపడుతున్నారు. ఇక శోభిత, సమంతల మీద కామెంట్స్ చేయడంపై వేణు స్వామిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. .ఈ మేరకు మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.