Venkatarami Reddy : ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలి. వాటి ప్రచారంలో పాల్గొనకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి సస్పెండ్ కావడం చర్చకు దారి తీసింది. ఆయనను సస్పెండ్ చేసిన ఈసీపైనే ఎదురు దాడికి దిగడంతో చర్చనీయాంశం అయింది.
వెంకట్రామిరెడ్డి అమరావతి దాటి వెళ్లకూడదని ఆర్డర్స్ పాస్ చేసింది ఈసీ. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయడంతో ఆయన సస్పెన్షన్ చర్చలకు దారి తీసింది. అవసరమైతే ఉద్యోగం నుంచి ఆయనను డిస్మిస్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉండడంతో వెంకట్రామిరెడ్డి ఏ దారి కనిపించడం లేదు.
ప్రస్తుతం అన్ని పోగొట్టుకుని జగన్ ఇంటి ముందు దాష్టీకం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వం మారగానే జగన్ ఇంటి ముందు నిలబడాల్సిన పరిస్థితి ఉంటుందంటున్నారు. జగన్ వీర విధేయుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి ప్రత్యక్షంగానే ఆయనకు మద్దతుగా నిలవడం వివాదాలకు తావిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం ఉండగా ఇలాంటి పిచ్చి పనులు చేసి ఉద్యోగం ఊస్ట్ చేసుకోవడం తెలివి తక్కువతనమే.
వెంకట్రామిరెడ్డి ఉద్యోగ సంఘం నేతగా కాకుండా జగన్ కొలువులో పాలేరుగా వ్యవహరించారు. టీడీపీ హయాంలో ఫైల్స్ చోరీ చేసిన కేసులో నిందితుడు కావడం గమనార్హం. ఇప్పుడు ఉద్యోగం కూడా పోవడంతో రిస్క్ లో పడిపోయాడు. జగన్ ప్రభుత్వంలో అన్ని తానై నడిపించిన అతడు ప్రస్తుతం ఒంటరిగా మారిపోయాడు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడతాడో తెలియడం లేదు.
వెంకట్రామిరెడ్డి తీరు ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడంతో సస్పెన్షన్ కు గురయ్యాడు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఆయనపై కఠిన చర్యలుంటాయని చెబుతున్నారు. ఈ క్రమంలో వెంకట్రామిరెడ్డి భవిష్యత్ ఏమిటనే దానిపై పలు రకాల చర్చలు వస్తున్నాయి.