JAISW News Telugu

Venkatesh-BJP : పెద్దపల్లిలో బీజేపీ నుంచి వెంకటేష్ పోటీ?

Venkatesh contest from BJP in Peddapalli?

Venkatesh contest from BJP in Peddapalli?

Venkatesh-BJP : తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీల్లో మార్పులు సంభవిస్తున్నాయి. గెలిచే నేతల కోసం పార్టీలు పరుగులు పెడుతున్నాయి. నేతలు కూడా తమకు కలిసొచ్చే పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితిపై పార్టీల్లో కలవరం మొదలైంది.

ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా విజయం సాధించిన బోర్లకుంట వెంకటేష్ నేత తన పనితనం సరిగా చూపించడం లేదు. ఫలితంగా నియోజకవర్గంలో అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు. ప్రజల్లో మమేకమై వారితో ఉండేందుకు ఇష్టపడటం లేదు. గెలిచింది మొదలు హైదరాబాద్ కే పరిమితమవుతున్నారు. దీంతో స్థానిక నేతల్లో ఆగ్రహం పెరిగింది.

ఆయనకు మళ్లీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు లేవని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. ఆయన స్థానంలో ఇతరులను నిలబెట్టాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ఏవైనా పనులు చేశారంటే అదీ లేదు. ఎవరైనా ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. తన పదవి కాపాడుకునేందకు ప్రజలతో కూడా సత్సంబంధాలు కొనసాగించడం లేదు. దీంతో ఆయనను మార్చాలని యోచిస్తున్నట్లు చర్చలు వస్తున్నాయి.

దేశంలో మోదీ మేనియా కొనసాగుతోంది. మోదీ చరిష్మాతో దేశమంతా మోదీ నామం జపిస్తోంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బోర్లకుంట వెంకటేష్ నేత కూడా బీజేపీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి లోక్ సభ ఎన్నికల్లో కూడా శఠగోపం పెట్టడం ఖాయమనే నిర్ణయానికి వస్తున్నారు. దీంతో పార్టీ మారి తమ పవర్ నిలబెట్టుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వెంకటేష్ నేత బీజేపీలో చేరి తన పదవిని మరోసారి దక్కించుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. అందుకే బీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం  లేదని అంటున్నారు. బీజేపీ నుంచి టికెట్ దక్కించుకోవాలని యోచిస్తున్నట్లు భావిస్తున్నారు. దీంతో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీలో ఎవరుంటారో తెలియడం లేదు.

బీఆర్ఎస్ వెంకటేష్ నేతకు కాకుండా ఓ మాజీ మంత్రికి ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు సీట్లు బీఆర్ఎస్ కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బే. అందుకే అక్కడ పోటీకి వెంకటేష్ నిరాకరిస్తున్నారు. బీజేపీ వైపు వెళుతున్నారు. ఆ నష్టాన్ని నివారించుకునే క్రమంలో సమర్థుడైన నేతకే టికెట్ కేటాయించాలని బీఆర్ఎస్ కూడా ఆలోచిస్తోంది.

ఇక పెద్దపల్లి ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడ అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉంది. గతంలో ఎంపీగా చేసిన వివేక్ ఈసారి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ లో ఆయన మంత్రి కావడం ఖాయం. ఇక బీఆర్ఎస్ నుంచి బాల్క సుమన్ సహా కొంత మంది పేర్లు వస్తున్నాయి. అందుకే వెంకటేష్ నేత కూడా బలమైన ఎస్సీ నేతగా ఉండడంతో ఆయన బీజేపీలో చేరి మోడీ మేనియాతో గెలవాలని చూస్తున్నారు. బీజేపీ కూడా అభ్యర్థుల కొరత దృష్ట్యా వెంకటేష్ ను నిలబెట్టాలని యోచిస్తోంది. దీంతో పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి ఎవరు రంగంలో దిగుతారో అనే అనుమానం అందరిలో నెలకొంది.

Exit mobile version