Vellampalli Srinivas : మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో రాజకీయాలలో తమదైన ముద్ర వేసిన స్వర్గీయ రోశయ్య అనంతరం ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి విశ్వ ప్రయత్నం చేసిన వెళ్లంపల్లి- ఎక్కడ అంబికా కృష్ణ విఫలమయ్యాడు, అక్కడ విజయం సాధించారు వెళ్లంపల్లి. ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీ- చక చక పార్టీలు మార్చి పెద్దిరెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే, మినిస్ట్రీ అందునా ఎండోమెంట్స్ – సంపాదించి; టీడీపీ పై నోరు పారేసుకున్న వెళ్ళంపల్లి జగన్ అభిమానాన్ని చాటుకున్నారు. ఒక మంత్రిగా కాక విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే గా తన అనుచరుల కు ప్రాధాన్యత ఇచ్చారు; విమర్శలు కొని తెచ్చుకున్నారు. మంత్రి పదవి పోయింది; విజయవాడ సెంట్రల్ ఇంచార్జీ గా నియమిం పబడ్డారు. వంగవీటి ఫ్యామిలీ కి కేటాయించిన సీట్ అది.
సెంట్రల్ లో వెల్లంపల్లి పోటీ చేస్తే గెలిచే సమస్య లేదు. దీనితో విజయవాడ వైశ్యులు జగన్ కు తమదైన శైలిలో ఎదురు తిరిగారు. కొడాలి నాని, వంశీ, రోజా వాచాలత వైసీపీ పార్టీకి నష్టం కలిగిస్తోంది అని బహిరంగ సభలో అన్న నెల్లూరు వైశ్.య నాయకునికి జరిగిన పరాభవం ఆ సమాజ మనో భావాలను దెబ్బ తీశాయి.
ఇదే అంశంపై మల్లాది విష్ణు కు ఎందుకు సీట్ ఇవ్వరు? అని బ్రహ్మీన్ కమ్యూనిటీ నిలదీస్తుంది.ఈ రెండు వర్గాలు వైసీపీ నేత కు దూరం కావడం కాదు, సంఘటితంగా అన్ని రాజకీయ పార్టీలకు డిమాండ్స్ పెడుతున్నాయి.
— తోటకూర రఘు ఆంధ్ర జ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు