
Vayugundam
Vayugundam : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం చెన్నైకి 490 కి.మీ., పుదుచ్చేరికి 500 కి.మీ., నెల్లూరుకు 590 కి.మీ. దూరంతో కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఈ నెల 17న పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసింది.
చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని,మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.