Vasireddy Padma : మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోలీసులకు వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు

Vasireddy Padma
Vasireddy Padma : వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్లను మాధవ్ వెల్లడిస్తున్నారని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచారుల బాధితుల పేర్లను వెల్లడించడం దుర్మార్గమని, వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
తన రాజకీయపరమైన నిర్ణయాన్ని వారంలో ప్రకటిస్తానని ఆమె తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనకు ఆప్తులని చెప్పారు. వాసిరెడ్డి పద్మ ఇటీవల వైసీపీ పార్టీకి జీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆమె వైసీపీ అధ్యక్షుడు జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.