న్యూజెర్సీలోని ఎడిసన్ శ్రీ శివ విష్ణు దేవాలయంలో వసంత నవరాత్రి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ కార్యక్రమంలో యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు పాల్గొని శ్రీరామనవమి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రాముల వారికి పూజలు క్రతువులు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జై గారికి స్వామి వారి చిత్రపటాలను బహూకరించారు. మార్చి 29, 2025 నుండి ఏప్రిల్ 6, 2025 వరకు జరిగే ఈ వేడుకలో 69వ – 7వ రోజుల కార్యక్రమాలు ప్రత్యేకంగా భక్తులను ఆకట్టుకోనున్నాయి.
ఆరవ రోజు ఏప్రిల్ 5 ఉదయం 5:00 గంటలకు కాకడ హారతితో ప్రారంభమైంది. తరువాత 6:00 గంటలకు సుప్రభాతం పఠనం జరిగింది. 6:45 గంటలకు బాబా, నవగ్రహ , శనీశ్వర తైలాభిషేకం నిర్వహించారు. ఉదయం 8:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు అఖండ సచ్చరిత్ర పారాయణం కొనసాగింది.
ఉదయం 8:30 గంటలకు గౌరీ పూజ, 9:00 గంటలకు బాబాకు సామూహిక సహస్రనామార్చన భక్తులచే నిర్వహించబడింది. ఉదయం 9:45 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఎదుర్కోలు (స్వాగత వేడుక) జరిగింది.
ఉదయం 10:00 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మహా సంకల్పం, మాంగల్య ధారణ, తలంబ్రాలు మరియు వధూవరుల యొక్క పూలమాలల మార్పిడి వంటి కార్యక్రమాలు కన్నుల పండుగగా సాగాయి.
సాయంత్రం 4:00 గంటలకు హనుమంతునికి అర్చన , తరువాత హనుమాన్ చాలీసా పారాయణం, హారతి, మంత్రపుష్పం సమర్పించారు. సాయంత్రం 5:00 గంటలకు ధూప్ హారతి మరియు 5:30 గంటలకు విష్ణుసహస్రనామ పారాయణం జరిగింది.
సాయంత్రం 6:00 గంటలకు శ్రీ చక్ర నవావరణ పూజ, దేవి ఖడ్గమాలా పూజ, లలితా సహస్రనామ పారాయణం మరియు సామూహిక కుంకుమార్చన మహిళా భక్తులచే నిర్వహించబడ్డాయి. రాత్రి 7:00 గంటలకు కమ్యూనిటీ హాల్‌లో సతగలార్చన జరిగింది.
ఏడవ రోజు ఆదివారం ఏప్రిల్ 6 సాయంత్రం 4:30 గంటలకు ధూప్ హారతితో ప్రారంభమైంది. తరువాత 5:00 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. అదే సమయంలో ప్రత్యక్ష బాబా విగ్రహం ముందు బియ్యం బస్తా మార్పు కార్యక్రమం నిర్వహించారు.
సాయంత్రం 5:30 గంటలకు బాబా, రామ పరివార్ పూజ , శ్రీ రామ పట్టాభిషేకం వేడుక కన్నులకింపుగా జరిగింది. సాయంత్రం 6:00 గంటలకు బాబా, రామ పరివార్ .. శ్రీమాతా పల్లకి ఉత్సవం డోలు మరియు డ్రమ్ముల నడుమ ఊరేగింపుగా జరిగింది. దీని తరువాత చందనోత్సవం , లాష్ ధోల్ తాషా పథక్, భారతీయ మూలాలున్న అమెరికన్స్ తో ప్రత్యేక ప్రదర్శన అందరినీ అలరించింది.
ఈ విధంగా శ్రీ శివ విష్ణు దేవాలయంలో జరిగిన వసంత నవరాత్రి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ముగిసింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల ఆశీస్సులు పొందారు.
*ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని ఫొటోలను కింది లింక్ లో చూడొచ్చు..
న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు దేవాలయంలో వసంత నవరాత్రి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం దృశ్యమాలిక