నిజమైన ఎయిర్ బేస్ కు వెళ్లి ఆపరేషన్ వాలెంటైన్ మూవీ షూటింగ్ చేశామని హీరో వరుణ్ తేజ్ వెల్లడించారు. ఎయిర్ బేస్ లో ఫోన్లకు అనుమతి లేదని వరుణ్ తేజ్ తెలిపారు. ఉదయం ఎనిమిది లోపు సినిమా యూనిట్ అంతా కలిసి అక్కడికి చేరుకు న్నామని ఆయన తెలిపారు.
ఇలా 40 రోజులపాటు అక్కడ షూటింగ్ చేశామని హీరో వరుణ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు చే సిన ఆపరేషన్లు గురించి వింటూ స్ఫూర్తి పొందేవాడినని వరుణ్ తేజ్ తెలిపారు. ఈ సినిమా కోసం నా పెళ్లి ముహూర్తాన్ని మార్చు కు న్నారని ఆయన అన్నారు. షూటింగ్ పూర్తయ్యాక వివాహం చేసుకున్నానని వరుణ్ తేజ్ ఆ ఇంటర్వ్యూలో తెలియజేశారు.