Varun Tej : బాబాయ్ పిలుపు కోసం అబ్బాయ్ ఎదురు చూపు.. పొలిటికల్ క్యాంపెయిన్ పై స్పందించిన వరుణ్ తేజ్
Varun Tej Political Campaign : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరింత దగ్గర పడుతున్నాయి. నాయకులు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. టీడీపీ సభలు, సమావేశాలతో స్ట్రాట్ చేస్తే.. కాంగ్రెస్ నేరుగా ప్రజల్లోకి వెళ్తూ ప్రచారం మొదలు పెట్టింది. ఇలా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటుంది. టీడీపీ+జనసేన పొత్తు కన్ఫమ్ అని తెలుస్తున్నా.. సీట్ల పంపకాలపై రోజుకో విషయం బయటకు వస్తుంది.
గతంలో తిరుపతిలో ఒక సమావేశానికి హాజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు విలువ ఇవ్వని వారితో కలిసి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అయితే ఆయన ఈ విషయం ఎందుకు ప్రస్తావించారో అర్థం కాలేదు. బహూషా సీట్ల పంపకాల విషయంలో ఇలా స్పందించారా? అని తెలియలేదు.
గతంలో ఒక సీటుకే పరిమితమైన జనసేన పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా ఈ సారి పోటీ చేయబోతున్నట్లు పార్టీ వర్గాల నుంచి విస్వసనీయ సమాచారం. కానీ, ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న విషయంపై మరికొన్ని రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది. అయితే తన తండ్రి, బాబాయ్ కి ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రచారం చేస్తారా? పొలిటికల్ క్యాంపెయిన్ లో పాల్గొంటారా? అనే ఆసక్తిని ఏపీ ప్రజలు కనబరుస్తున్నారు. ఒక వెబ్ ఛానల్ కు ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘ఏమో.. ఇప్పటి వరకూ అనుకోలేదు. బాబాయ్ ఏం చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఆయన పిలుపు కోసమే ఎదురు చూస్తున్నా’ అన్నాడు. పార్టీ వర్గాలు మాత్రం ఈ సారి వరుణ్ తేజ్ నేరుగా క్యాంపెయిన్ లో పాల్గొంటారని చెప్తున్నాయి. ఒక్క వరుణ్ తేజ్ మాత్రమే కాదు.. సాయిధరమ్ తేజ్.. దాదాపు మెగా ఫ్యామిలీ మొత్తం ఏపీపై ఫోకస్ పెడుతుందని అంతా చర్చించుకుంటున్నారు.
నాగాబాబుకు అంజనా ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. రామ్ చరణ్ ‘ఆరెంజ్’ తర్వాత ఆ బ్యానర్ నుంచి ఏ సినిమా కూడా రాలేదు. ఆ బ్యానర్ ను వరుణ్ తేజ్ టేకప్ చేస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై వరుణ్ మాట్లాడుతూ ‘నేను ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ చేస్తున్నా. ముందు హీరోగా మరిన్ని మంచి సినిమాలు చేయాలి.. మరిన్ని హిట్లు కొట్టాలి. ఆ తర్వాతే.. మిగిలిన విషయాలు ఆలోచిస్తా’ అని చెప్తున్నాడు.