Varun Tej : ఫిదా, గద్దలకొండ గణేష్ లాంటి ప్రాజెక్టులతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్క ఊపు ఊపిన వరుణ్ తేజ్ తర్వాత ఘనీ, ఆపరేషన్ వాలెంటైన్ తో భారీ పరాజయాలను మూట గట్టుకున్నాడు. ఇండస్ట్రీలో మళ్లీ తన హవా కొనసాగించాలంటే ఇప్పటికిప్పుడు మంచి హిట్ పడాలి. లేదంటే ఫేడవుడ్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. దీనిలో భాగంగానే నవంబర్ 14న విడుదల కానున్న ‘మట్కా’ ఆయనకు మేకింగ్ ఆర్ బ్రేక్ మూవీగా కనిపిస్తోంది. తన కెరీర్ లో అత్యంత కీలకమైన చిత్రంగా కనిపిస్తుంది.
మట్కా హిట్ ఆయన కెరీర్ లో మళ్లీ ఇండస్ట్రీలో బౌన్స్ అవుతాడు. లేకపోతే, అతను కోలుకోవడం కష్టమైన లోతుల్లోకి నెట్టబడతాడు. మట్కా వరుణ్ తేజ్ కు కేజీఎఫ్ తరహా విజయాన్ని అందించి అతని కెరీర్ ను గణనీయంగా పెంచుతుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
అయితే మట్కా నేరుగా సూర్య నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కంగువాతో పోటీ పడనుంది. మట్కాకు మంచి టీజర్ ఉంది. ఇప్పటికే హ్యూజ్ వ్యూవ్స్ ను దక్కించుకుంది. కానీ కంగువా చుట్టూ ఉన్న భారీ హైప్ ను ఎదుర్కోవడానికి ఇది ఇంకా ఎక్కువ బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది.
కరుణ కుమార్ దర్శకత్వం వహించిన మట్కా నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొందిన కథ. 1960లో జూదం బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో మట్కా తెరకెక్కించారు దర్శకుడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన గుంటూరు కారం, దేవర వంటి చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు మిడ్ నైట్ ప్రీమియర్లను కూడా ప్రదర్శించనుంది.
కంగువపై భారీ అంచనాలున్నాయి. దాని స్టార్ పవర్ కూడా ఎక్కువే.. దీనిపై మట్కా పైచేయి సాధించాలంటే మరింత ప్రచారంతో పాటు.. డిఫరెంట్ ట్రైలర్ అవసరం అవుతాయి.