Varra Ravinder Reddy : వర్రా రవీందర్ రెడ్డి కేసు.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ ఇంటికి పోలీసులు
Varra Ravinder Reddy : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పులివెందుల పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. పులివెందుల అర్బన్ ఎస్సై జీవన రంగనాథ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు రాఘవరెడ్డి ఇంటికి వెళ్లాయి. వైసీపీ సామాజిక కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి తప్పించుకున్న సమయంలో అతనితో రాఘవరెడ్డి ఛాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న రాఘవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆయన ఇంటి లోపల సోదాలు చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాఘవరెడ్డి కుటుంబ సభ్యల వెంట లాయర్ ఓబులరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. రాఘవరెడ్డి ఇంటికి వచ్చి వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు ఆదేశించి వెనుదిరిగారు.
వైసీపీ అధికారంలో ఉండగా వర్రా రవీంద్రా రెడ్డి అడ్డూ అదుపూ లేకుండా మితిమీరి ప్రవర్తించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, వంగలపూడి అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఆయనపై మంగళగిరి, హైదరాబాద్ లో పలు కేసులున్నాయి. ఆయనను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.