RGV-Nara Lokesh : వాలంటైన్స్ వీక్ లో భాగంగా ఈ రోజు ‘కిస్ డే’.. అంటే తమకు ఇష్టమైన వాళ్లకు కిస్ (ముద్దు) ఇచ్చి వారి ప్రేమను తెలిపే రోజు అన్నమాట. ఇందులో భాగంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నారా లోకేష్ కు ముద్దు పెట్టాడు. నేరుగా కాకున్నా.. ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చి తన ప్రేమ వెల్లడించాడు.
రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహంను ఆపాలని నారా లోకేష్ ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఆ పని చేయడం వల్ల తమకు మరింత కలిసొచ్చిందంటున్నాడు వర్మ. అందుకే ఈ ఫ్లయింగ్ కిస్ అంటూ చెప్పాడు. ఇంకా వర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే?
‘వ్యూహంను డిసెంబర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ లోకేష్ తన బుర్ర వాడి సినిమాను ఎన్నికల ముందు రిలీజ్ అయ్యేలా చేశాడు. లోకేష్ ఎంత తెలివైనోడంటే, మేము అనుకున్నట్లు డిసెంబర్ లోనే ఈ సినిమా రిలీజై ఉంటే ఈ పాటికి జనం మరిచిపోయేవారు. కానీ లోకేష్ సరైన వ్యూహం పన్ని ఎలక్షన్ టైమ్ లో రిలీజ్ అయ్యేలా చేశాడు.. ఇదీ లోకేష్ తెలివి. అందుకే లోకేష్ కు ముద్దు ఇచ్చాను.’ అని చెప్పాడు.
‘తన సినిమాపై సెన్సార్ ఎఫెక్ట్ పడదంటున్నాడు వర్మ. అంటే వాళ్లు కట్ చేసిన సీన్స్ ను ఓటీటీ లో లేదంటే యూట్యూబ్ లో రిలీజ్ చేస్తాననే అర్థం వచ్చేలా చెప్పాడు. ‘చట్ట ప్రకారం సెన్సార్ బోర్డ్ వారి పని చేసింది. వాళ్లు కట్ చేసిన సీన్లతో సినిమాపై ఎలాంటి ప్రభావం పడలేదు. ఏది కట్ చేసినా ఎక్కడో ఒక చోట యాడ్ చేస్తాము. సెన్సార్ కట్స్ తో సినిమాలో ఎమోషన్ తగ్గలేదు, లోకేష్ మీద ఒట్టు.’ అన్నాడు.
షర్మిల పాత్రపై స్పందించిన వర్మ ‘రీసెంట్ గా వచ్చిన యాత్ర-2లో షర్మిల పాత్ర లేదు. అయితే, వ్యూహంలో మాత్రం షర్మిల పాత్ర ఉందని క్లారిటీ ఇచ్చాడు రాం గోపాల్ వర్మ.