JAISW News Telugu

Pawan Kalyan : బిగ్ ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. పునరాలోచనలో పవన్?

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : ఏపీ ఎన్నికల్లో పిఠాపురం చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గం మీద వచ్చిన వార్తలు మరే నియోజకవర్గం మీద రావడం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అంటూ పవన్ ప్రకటించగానే అక్కడి టీడీపీ అశావహ అభ్యర్థి వర్మ  అనుచరులు ఆందోళనలకు దిగారు. అయితే చంద్రబాబు వర్మను పిలిచి మాట్లాడడంతో ఆయన మెత్తబడ్డారు. పవన్ కు మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు.

అంతా సర్దుకుంది అనుకునే లోపే వర్మ మరో బాంబు పేల్చి పవన్ కు అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. పిఠాపురంలో పవన్ పోటీ.. తన మద్దతుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి పిఠాపురంలో వర్మకు మంచి పట్టే ఉంది. 2014లో పొత్తుల కారణంగా టీడీపీ నుంచి సీటు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈ సారి పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నానని పవన్ ప్రకటించారు. ఆ తర్వాత వర్మ అనుచరుల రగడ, వర్మకు బుజ్జగింపు అన్నీ జరిగాయి. పవన్ కు సహకరిస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు ఆయనకు హామీ సైతం ఇచ్చారు.

అయితే తాజాగా పవన్ తాను ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేద్దామని భావిస్తున్నానని.. ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే తాను, ఉదయ్ శ్రీనివాస్ సీట్లు మార్చుకుంటామని చెప్పారు. దీంతో ఇప్పుడు వర్మ స్పందిస్తూ.. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తేనే మద్దతు ఇస్తానని చెప్పానని, మిగతా ఎవరు పోటీ చేసిన పల్లకి మోయనని తేల్చిచెప్పారు. పవన్ పోటీ చేయకపోతే తానే పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టారు. పవన్ చేయకపోతే తానే అభ్యర్థినని చంద్రబాబు సైతం చెప్పారని  వెల్లడించారు. దీంతో పవన్ కాకుండా పిఠాపురం నుంచి ఉదయ్ పోటీ చేస్తే వర్మ సహకారం అందదు అని స్పష్టం అవుతోంది. దీంతో జనసేనాని తన ప్రకటనపై పునర్ ఆలోచన చేయక తప్పని పరిస్థితి ఎదురైంది.

Exit mobile version