Varalakshmi Sarath Kumar : రీసెంట్ గా విడుదలైన ‘హనుమాన్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మన కళ్ళతోనే చూస్తూ ఉన్నాం. ఈ సినిమాకి టికెట్స్ దొరకకపోవడం తో, సంక్రాంతి సినిమాలు బ్రతికేస్తున్నాయి. టికెట్స్ దొరకని వాళ్లంతా వేరే సినిమాలకు వెళ్లిపోతున్నారు. ఈ సినిమా విడుదలై దాదాపుగా నాలుగు రోజులైంది. ఈ నాలుగు రోజులకు 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఒక చిన్న సినిమాకి వారం రోజుల లోపు 50 కోట్ల రూపాయిల షేర్ రావడం అనేది ఎప్పుడైనా చూశామా?, ఈ సినిమా విషయం లోనే అది జరిగింది. థియేటర్స్ లేక ఉదయం ఆటలు ప్రదర్శిస్తే అవి కూడా నిమిషాల వ్యవధిలో హౌస్ ఫుల్స్ అవుతున్నాయి అంటే, జనాల్లోకి ఈ సినిమా టాక్ ఏ రేంజ్ లో వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఊపుని చూస్తూ ఉంటే ఫుల్ రన్ లో కచ్చితంగా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
ఇకపోతే ఈ చిత్రం లో తేజ సజ్జ సోదరిగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన సంగతి తెలిసిందే. లేడీ విలన్ గా , క్యారక్టర్ ఆర్టిస్టుగా సౌత్ లో ఈమెకి ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో కూడా ఆమె పవర్ ఫుల్ రోల్ ని పోషించింది. కానీ రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే అందుకుంది అట. సాధారణంగా కొంతమంది ఆర్టిస్టులు, చిన్న బడ్జెట్ సినిమాలకు ఒకలాగా, పెద్ద బడ్జెట్ సినిమాలకు ఒకలాగా డబ్బులు డిమాండ్ చేస్తారు. వరలక్ష్మి శరత్ కుమార్ సౌత్ లో ఒక్క సినిమా చెయ్యాలంటే ఆమెకి కోటి 50 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. అడ్వాన్స్ 50 లక్షలు ఇస్తే కానీ ఆమె అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యదు. ఈ సినిమాకి కూడా అలాగే చేసిందట.
సుమారుగా ఆమె కోటి 75 లక్షల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ అందుకుంది అట. ఈ సినిమాలో హీరో గా నటించిన తేజ సజ్జ కోటి రూపాయిల లోపే రెమ్యూనరేషన్ ని తీసుకున్నాడు. కానీ ఈమె మాత్రం హీరో కంటే ఎక్కువ తీసుకుంది. సినిమా బడ్జెట్ మొత్తం కలిపి 20 కోట్ల రూపాయిలు మాత్రమే అయ్యిందట. 20 కోట్ల బడ్జెట్ లో పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని, ఈ రేంజ్ క్వాలిటీ సినిమా తీసాడంటే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టాలెంట్ సాధారణమైనది కాదు, భవిష్యత్తులో ఈయన ఏ రేంజ్ కి వేళ్తాడో చూడాలి.