Revanth Reddy:జీవన ప్రయాణంలో ఎవరు ఏ తీరం చేరతారో..ఎవరు ఎలాంటి ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారో అన్నది కాలంతో పాటు మన క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం కాంగ్రెస్ డేరింగ్ లీడర్ అనుముల రేవంత్ రెడ్డి. జవ సత్వాలు ఒడిగి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎలాంటి కదలిక లేకుండా ఉన్న కాంగ్రెస్‌కు తెలంగాణలో నూతన జవసత్వాలని అందించి గెలుపు బాట పట్టించిన హీరో రేవంత్ రెడ్డి.
సీనియర్లు వెంట నడవనంటున్నా.. పార్టీ క్యాడర్ అనుమానంతో చూస్తున్నా సవాళ్లని ఎదిరించి అందరినీ కలుపుకుని ముందుకు సాగిన రేవంత్ రెడ్డి తెలంగాణలో తన చరిష్మాతో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించారు. మరి కొన్ని గంటల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సామాన్యుడిగా ప్రయాణం మొదలు పెట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని మరి కొన్ని గంటల్లో అధిరోహించబోతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడయా వేదికగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
కొన్నేళ్ల క్రితం టీడీపీ పార్టీలో రేవంత్‌రెడ్డి, విజయవాడకు చెందిన వల్లభనేని వంశీ ఒకేసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఇద్దరిదీ ఒకే వయసు. ఒకే పార్టీ నుంచి రాజకీయాల్లో ఎదిగారు. ఈ రోజు ఎవరు ఏ స్థానంలో ఉన్నారో మనకు తెలిసిందే. ఒకరి క్యారెక్టర్ క్యారికేచర్‌కే పరిమితమైతే!..మరొకరి క్యారెక్టర్.. సీఎం పీఠానికి రెడ్ కార్పెట్ పరిచింది!!.
ఈ ఇద్దరు నేతలు తెలుగుదేశం పార్టీలోనే పెరిగి పార్టీలు మారినా… టీడీపీ క్యార్యకర్తలు ఒకడిని ఈసడించుకుంటుంటే…మరొకరిని గుండెల్లో పెట్టుకుంటున్నారు. క్యారెక్టర్ అనేది కొనుక్కుంటేనో..అమ్ముడు పోతేనో వచ్చేది కాదు. క్యారెక్టర్ అనేది పెద్దల పెంపకం ద్వారా, మన నడవడిక ద్వారా మన వెంట వచ్చేది. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న `ఎనుముల రేవంత్ రెడ్డి`గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.