JAISW News Telugu

Vallabhaneni Vamsi : టీడీపీ నేతపై దాడి కేసులో వల్లభనేని వంశీ అనుచరుల అరెస్టు

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi : కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో వంశీ ప్రధాన అనచరుడు ఓలుపల్లి మోహనరంగాతో పాటు మరికొందరు ఉన్నట్లు సమాచారం. గతంలో వైసీపీలో ఉన్న రంగబాబు ఎన్నికలకు టీడీపీలో చేరడంతో జీర్ణించుకోలేని వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్ ఎలైట్ హోటల్ వద్ద ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి.

ఈ సంఘటనపై ఆయన పోలీసులకు రంగబాబు ఫిర్యాదు చేశారు. పొలం విషయం మాట్లాడాలని పిలిచి తనపై దాడిచేసినట్లు ఫిర్యాలు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చింది. తాజాగా, ఈ కేసు విచారణలో కదలిక వచ్చింది. నిందితులు ఓలుపల్లి మోహనరంగా, అనగాని రవి, భీమవరపు రాము, ఎం.బాబు, సూరపనేని అనిల్, పొన్నూరు సీమయ్య, గుర్రం నానిలను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Exit mobile version