JAISW News Telugu

Vakeel saab 2:`వకీల్‌సాబ్ 2`కి కథ దొరికేసిన‌ట్టే

Vakeel saab 2:రీమేక్ సినిమా అయినా కానీ వ‌కీల్ సాబ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ పింక్ కి రీమేక్ గా రూపొందించిన ఈ సినిమా తెలుగులోను బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకుంది. క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు ద‌క్కించుకుంది ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ అభిమానులకు వకీల్ సాబ్ ఒక మధురమైన జ్ఞాపకం. క‌రోనా నుంచి కోలుకుంటున్న స‌మ‌యంలో ఏపీలో టిక్కెట్ రేట్ల నియంత్రణను అధిగమించి ఫ‌ర్వాలేద‌నిపించే వ‌సూళ్ల‌ను సాధించింది.

తొలిసారి లాయర్ కోటు వేసుకుని కోర్టులో పవర్ స్టార్ నటన, ప్రకాష్ రాజ్‌తో తలపడిన సన్నివేశాలు అబ్బురపరిచాయి. అయితే దానికి సీక్వెల్ గా నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ 2 సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది కానీ సరైన కథ లేకపోవడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. దర్శకుడు వేణు శ్రీరామ్ ఎస్‌విసి బ్యానర్‌లో నితిన్‌తో సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఇలా సీక్వెల్ క‌థ కోసం వెతికేవారందరికీ శుభ‌వార్త‌. మలయాళంలో వకీల్ సాబ్ సీక్వెల్ కి స‌రిప‌డేలా పర్ఫెక్ట్ సినిమా వచ్చింది.

మోహన్ లాల్ హీరోగా ధిష్య ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా టైటిల్ నేరు. ఇది మల్లూవుడ్ లో సూపర్ హిట్ దిశగా పరుగులు తీస్తోంది. సలార్ నుంచి పోటీ వచ్చినా తట్టుకుని బలంగా నిలబడింది. నిజానికి ఈ సినిమాపై వెంకటేష్ ఇంట్రెస్ట్ చూపించాడనే టాక్ ఉంది. అయితే సినిమా చూసిన వారికి మాత్రం వకీల్ సాబ్ 2 కి సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. కళ్లు లేని మిడిల్ క్లాస్ అమ్మాయిని మంత్రి కొడుకు అత్యాచారం చేస్తే హీరో ఎలా పోరాడి గెలుస్తాడు అనే పాయింట్ మీద ఈ సినిమా క‌థ‌ నడుస్తుంది.

కేవలం రెండు ఇళ్లు, కోర్టు గది సెటప్‌లో జీతూ జోసెఫ్ రెండున్నర గంటల కంటెంట్‌ని బోర్ కొట్టకుండా మేనేజ్ చేశాడు. రెమ్యూనరేషన్ తప్ప ప్రొడక్షన్ పరంగా పెద్దగా ఖర్చు లేని సబ్జెక్ట్ ఇది. ప‌వ‌న్ త్వ‌ర‌గా ఏదైనా చేయాల‌నుకుంటే ఇది బెస్ట్ అవుతుంద‌ని కూడా సూచిస్తున్నారు. నేరు`లో హీరోయిన్ లేదు. పాటలు అసలే లేవు. కావాలంటే కాస్త కమర్షియల్ టచ్ ఇవ్వొచ్చు కానీ టైటిల్స్ నుంచి చివరి వరకు సీరియస్ టోన్ లో సాగుతుంది. `ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ క‌థ‌తోనే తెర‌కెక్కుతోంది. హ‌రీస్ ఇప్పటికే పనిలో ఉన్నాడు. మ‌ల్లూ హిట్ మూవీ నేరు క‌థ ప‌వ‌న్ కి న‌చ్చితే దానిని వ‌కీల్ సాబ్ 2గా తీసే వీలుంటుందేమో!

Exit mobile version