Nithya Menon : తెలుగు ఇండియన్ ఐడల్ లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఈ షోలో జడ్జిలుగా సంగీత దర్శకుడు తమన్, టాలీవుడ్ బ్యూటీ బబ్లీ హిరోయిన్ నిత్యా మీనన్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే కంటెస్టెంట్ గా వచ్చిన ఒక కుర్రాడు చేతులకు గాజులు వేసుకుని వచ్చాడు. ఏంటీ గాజులు ఎందుకు వేసుకున్నావ్ అని తమన్ అడుగుతాడు. దానికి ఆ కంటెస్టెంట్ ఇచ్చిన సమాధానానికి అందరూ ఆశ్చర్యపోతారు.
కంటెస్టెంట్ మాట్లాడుతూ.. నేను గోల్డ్ షాపులో పనిచేసేవాడనిని డబ్బులు అన్నీ కూడబెట్టుకుని నిత్యామీనన్ కోసం గాజులు చేశానని చెప్పాడు. అప్పుడు తమన్ ఏంటీ నిజమైనవేనా అని అడుగుతాడు. అవును నిజమే అని కంటెస్టెంట్ చెబుతాడు. నిత్య కూడా ఆశ్చర్యపోతుంది. కానీ ఆ సమయంలో కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. అవి అసలు రోల్డ్ గోల్డా లేక గోల్డ్ అని అడగ్గా.. కంటెస్టెంట్ మాట్లాడుతూ.. పదేళ్ల కిందట గాజులు కొనిస్తే పెళ్లి చేసుకుంటా అన్నారు కదా.. అందుకే సేవ్ చేసుకుని మరీ గాజులు చేయించి తీసుకొచ్చా అని అంటాడు.
దీనికి నిత్య నోట మాట రాలేదు. ఆనంద బాష్పాలు మాత్రమే వచ్చాయి. తెలుగులో ఇప్పటికీ ఇంతటి అభిమానులు ఉంటారా అని ఆశ్చర్యపోయింది. దీంతో చంద కాంత్ నిత్య అంటూ కంటెస్టెంట్ పేరు, నిత్యమీనన్ పేరు కలిసి పలుకుతాడు తమన్. దీంతో షో మొత్తం నవ్వులతో నిండిపోతుంది. తెలుగులో మాత్రం ఏ హిరో, హిరోయిన్ ని అయినా అభిమానిస్తే చాలు ఎంతో ప్రేమిస్తుంటారు.
వారికి గుండెల్లో గుడి కట్టేస్తుంటారు. థియేటర్ల వద్ద కటౌట్లు కట్టడమే కాదు. వారిని ఆరాధిస్తారు. ఎంతో అభిమానిస్తుంటారు. వారి విజయాల కోసం ప్రార్థిస్తుంటారు. సినిమాలు ఫెయిల్ అయితే వారి కంటే ఎక్కువగా బాధపడుతుంటారు. ఇలా ఎంతో మంది పిచ్చి అభిమానులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిరో, హిరోయిన్ల విజయాల వెనక ఉన్నారు. అపజయాల్లో వారికి అండగా నిలుస్తున్నారు. అందుకే తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఏ హిరోయిన్ కూడా అంత ఈజీగా మరిచిపోదు.