Kangua యూఎస్ఏ రివ్యూ : కంగువా ఓవర్సీస్ రిపోర్ట్
ఈ సినిమా ప్రాచీన, ఆధునిక కాలాల మేళవింపుతో తెరకెక్కింది. ఈ సినిమాలో సూర్య తన వాళ్లను కాపాడుకోవడానికి అప్పుడు, ఇప్పుడు ఎలా ముందుకు సాగాడన్నదే నేపథ్యంతో సినిమాను తెరకెక్కించారని తెలుస్తున్నది. మరి అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..?
ఈ సినిమాను దర్శకుడు శివ చాలా అద్భుతంగా తెరకెక్కించాడట. ఆయన గతంలో చేసిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా మరింత భిన్నంగా ఉందంటున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు. సినిమా ప్రథమార్థం మొదట్లో నరేషన్ కాస్త నెమ్మదించినా కథలోకి వెళ్లే కొద్ది క్రమక్రమంగా పుంజుకుందట. ఈ సినిమాకి సంగీతం బాగా హెల్ప్ అయ్యిందని ప్రేక్షకులు చెబుతున్నారు.
క్యారెక్టర్ నిడివితో సంబంధం లేకుండా ఏ రోల్ ఇచ్చినా అందులో సూర్య ఎలా చెలరేగిపోతాడో అందరికీ తెలిసిందే. ఇందులోనూ సూర్య తన మ్యాజిక్ మరోసారి రిపీట్ చేశాడంటున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు. ప్రధానంగా రెండు గెటప్పుల్లో సూర్య తనదైన రీతిలో ఆకట్టుకున్నాడట. తొలి నుంచి వైవిధ్య మైన రోల్స్ తో ఆకట్టుకుంటున్న సూర్య ఇక్కడా తన మార్కును చూపించాడట. ఇక మిగతా నటీనటులు కూడా వాళ్ల మంచి పర్ఫామెన్స్ ఇచ్చారని అంటున్నారు. యానిమల్ తో విలన్ రోల్స్ కు టర్న్ అయిన బాబీ డియోల్ ఇందులోనూ చెలరేగిపోయాడట. మరి ఈ సినిమా ప్రేక్షకుడిని ఎలా అలరిస్తుంది. ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది తేలాల్సి ఉంది.
ఇక ఈ సినిమ అనుకున్న హిట్టయితే మాత్రం పాన్ ఇండియాలో సూర్య కూడా టాప్ హీరో అవుతాడనడంతో ఎలాంటి సందేహం లేదు. పాన్ ఇండియాలో ఈ సినిమా విడుదల కావడానికి మరి కొన్ని గంటల సమయం ఉన్నది. ఈ సినిమా విజయవంతమై సూర్యను పాన్ ఇండియా స్టార్ ను చేస్తుందా లేదా అనేది మరి కొన్ని గంటల్లో నిర్ణయం కానుంది.