H-1B Visas:US వెళ్లాలని అక్కడ తమ కలలని నిజం చేసుకోవాలని ప్రతీ ఏటా ఎంతో మంది అమెరికా వెళుతుంటారన్నది తెలిసిందే. వర్క్ వీసాపై వెళ్లి అక్కడ సాఫ్ట్‌వేర్ రంగంలో తమ టాలెంట్‌తో రాణించాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొంత మందికి అవసరమైన ఉద్యోగాలు లభిస్తే మరి కొంత మందికి వీసాలు లభించక వచ్చే ఏడాదికి వీసాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ హెచ్-1బి విదేశీ వర్క్ వీసాల కోసం పరిమితికి తగ్గట్లుగా US దరఖాస్తులని స్వీకరించిందని ఫెడరల్ ఏజెన్సీ ప్రకటించింది.
హెచ్-1బి వీసా అనేది వలసేతర వీసా. ఇది యూఎస్ కంపనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. భారతదేశం, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం పదివేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపనీలు దీనిపై ఆధారపడుతుంటాయి.
ఈ మేరకు 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఓ ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా రెగ్యులర్ క్యాప్ 65 వేలు, హెచ్-1బి వీసాకు US అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపు, సాధారణంగా 20 వేలకు చేరుకోవడానికి తగిన సంఖ్యలో పిటీషన్లు అందాయని పేర్కొంది. మాస్టర్స్ క్యాప్, 2024 ఆర్థిక సంవత్సరానికి US ఫెడరల్ ప్రభుత్వం యొక్క ఆర్థిక సంవత్సం అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది.
రాబోయే కొద్ది రోజుల్లో ఆన్‌లైన్ ఖాతాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎంపిక కాని వారికి నోటీసులను మేము పంపిస్తాము` అని USCIS తెలిపింది. కాప్ నుండి మినహాయించబడిన పిటీషన్లను స్వీకరించడం, ప్రాసెస్ చేయడం కొనసాగిస్తామని USCIS వెల్లడించింది. ప్రస్తుతం H-1B కార్మికుల కోసం దాఖలు చేసిన పిటీషన్లు గతంలో క్యాప్‌కు వ్యతిరేకంగా లెక్కించబడ్డాయి. ఇప్పటికే క్యాప్ నంబర్‌ను కలిగి ఉన్నవారు FY 2024 H-1B క్యాప్ నుంచి మినహాయించబడ్డారు.
ప్రస్తుత H-1B ఉద్యోగి యునైటెడ్ స్టేట్స్‌లో ఉండగలిగే సమయాన్ని పొడిగించడానికి దాఖలు చేసిన పిటీషన్లను ఫెడరల్ ఏజెన్సీ ఆమోదించడం, ప్రాసెస్ చేయడం కొనసాగిస్తుంది. ప్రస్తుతం H-1B కార్మికుల ఉద్యోగ నిబంధనలను మార్చడం, ప్రస్తుత H-1B కార్మికులను యాజమాని మార్పులను సులభతరం చేయడం వంటి ప్రయోజనాలని అందిస్తుంది. ప్రస్తుత H-1B కార్మికులు అదనపు స్థానాల్లో ఏకకాలంలో పని చేయడానికి ఉపయోగపడుతుంది.