JAISW News Telugu

US Secret Service : అమెరికా అధ్యక్షుడి పర్యటన.. భద్రతా సిబ్బందిని దోచుకున్న దొంగలు

US Secret Service

US Secret Service

US Secret Service : వీఐపీలకు సాధారణంగా భద్రతా సిబ్బంది ఉంటారు. వారు ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అదే వీవీఐపీలకు ఉండే భద్రతా సిబ్బంది విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదు. కాగా, ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడికి ఆ దేశ సీక్రెట్ సర్వీస్ సంస్థ భద్రతను కల్పిస్తుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షుడు ఒబామా.. వీరిద్దరూ కలిసి లాస్ ఎంజెల్స్ లో ఓ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం తరువాత అక్కడి నుంచి తిరిగి వెళ్తున్న ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ను టూస్టిన్ అనే ప్రాంతంలో తుపాకీతో బెదిరించి అతని వద్ద ఉన్న బ్యాగ్ ను దోచుకెళ్లారు. ఆ సమయంలో ఆ ఏజెంట్ కూడా కాల్పులు జరిపాడు. ఆ తరువాత ఆ ఘటనకు సంబంధించి బాధితుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు.

ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంటోని గుగ్లమొనీ స్పందించారు. తమ సిబ్బందిలో ఒకరు కాలిఫోర్నియాలో దోపిడీకి గురయ్యారని తెలిపారు. ఈ క్రమంలో అతడు తన సర్వీస్ గన్ తో ఫైరింగ్ కూడా చేశాడని పేర్కొన్నారు. దుండగుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా, దోపిడీ జరిగిన ప్రదేశం నుంచి ఓ కారు వేగంగా వెళ్లినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.

Exit mobile version