US GREEN CARD : అమెరికాలో పెరుగుతున్న గ్రీన్ కార్డులు.. ఇందులో భారతీయులు ఎంతో తెలుసా?
US GREEN CARD : అమెరికాలో సెటిలవ్వాలంటే గ్రీన్ కార్డు తప్పనిసరి. అమెరికా ప్రభుత్వం జారీచేసే అధికారిక పత్రం కోసం ఎన్నో కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి. అమెరికాలో శాశ్వత నివాసం కలిగి ఉండాలంటే ఈ కార్డు తప్పనిసరి. అమెరికా గ్రీన్ కార్డు పొందిన వ్యక్తులు అక్కడ పనిచేయడానికి, పాఠశాలకు వెళ్లడానికి, కుటుంబసభ్యులను అమెరికా తీసుకెళ్లడానికి అనుమతి లభిస్తుంది. అయితే ఇటీవల ఈ గ్రీన్ కార్డు పొందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఇందులో భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తున్నది.
గ్రీన్ కార్డును యూఎస్ పర్మినెంట్ రెసిడెంట్ కార్డుగా కూడా పిలుస్తారు. ఒక్కసారి అప్లై చేసుకుంటే అది అనుమతి పొందేందుకు ఒక్కోసారి పదేండ్లు కూడా పట్టొచ్చు. వెయిటింగ్ లిస్ట్ కూడా అంత పెద్దగా ఉంటుంది మరి. ఏటా పది లక్షల మంది ఈ కార్డులు పొందుతున్నట్లు సమాచారం. మన దగ్గరి బంధవులు ఎవరికైనా గ్రీన్ కార్డు ఉంటే వారి ద్వారా , లేదంటే మనం పనిచేసే కంపెనీ ద్వారా గ్రీన్ కార్డును దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా గ్రీన్ కార్డు లాటరీ కూడా ఇక్కడ నిర్వహించబడుతున్నది. ఏటా ప్రతి దేశానికి 7 శాతం వాటా కింద ఈ గ్రీన్ కార్డులు ఇస్తున్నారు.
ఇక గ్రీన్ కార్డులు పొందతున్న వారి జాబితాలో మెక్సికో అత్యంత ఎక్కువగా ఉందిజ 10.7 మిలియన్ల వలసదారులు ఇక్కడి నుంచే ఉంటున్నారు. 2022 లెక్కల ప్రకారం చూసుకుంటే మెక్సికో కు చెందిన 1,38,772 మంది గ్రీన్ కార్డు పొందారు. ఇక భారత్ 1,27,012, చైనా 67,950, ఇలా పలు దేశాల వ్యక్తులు అమెరికాలో గ్రీన్ కార్డు పొందాయి. ఈ కార్డులు పొందేందుకు పలు కుటుంబాలు ఏండ్ల తరబడి ఎదురు చూస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడి నిబంధనలు ఆ విధంగా ఉంటాయి. ఒక్కో దేశానికి 7 శాతం పరిమితే దాటితే ఇక ఆ ఏడాది నిలిపివేస్తారు. తిరిగి మరో ఏడాది వరకు ఎదురుచూడాల్సిందే. ఇక చాలా మంది భారతీయులు ఈ గ్రీన్ కార్డు కోసం పడరాని కష్టాలు పడుతూ ఉంటారు.