US election results : అమెరికా ఎన్నికల ఫలితాలు.. ట్రంప్-247, హారిస్-210

US election results

US election results

US election results : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ కు మరింత చేరువయ్యారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ట్రంప్ 247 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన జార్జియా, కాన్సస్, అయోవా, మోంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహామా, టెక్సాస్, ఆర్కాన్సాన్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసి, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో, నార్త్ కరోలినా రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు.

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 210 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు. కాలిఫోర్నియా, ఓరెగన్, వాషింగ్టన్, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్, కొలరాడో, హవాయి, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాను సొంతం చేసుకున్నారు. అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో రిపబ్లికన్లు విజయం సాధించారు. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లను తీసుకొచ్చింది. అటు పెన్సిల్వేనియా (19 ఓట్లు)లో తొలుత హారిస్ జోరు కనబడగా.. ప్రస్తుతం ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

TAGS