Urination Problem : తరుచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందా.. ప్రాణాంతక వ్యాధి కూడా కావచ్చు..

Urination Problems

Urination Problems

Urination Problem  : తరుచూ మూత్ర విసర్జన చేస్తుంటే షుగర్ ఉందా? అని అడుగుతుంటారు అందరూ. ఈ సమస్య చాలా మందిలో సర్వ సాధారణంగా ఎదుర్యే సమస్యనే. కొన్ని సందర్భాల్లో పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా.. మరి కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా నరకంగా అనిపిస్తుంది. ఇలా తరుచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం డయాబెటీస్ కావచ్చని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇది మరి కొన్ని ప్రమాదకర అనారోగ్యాలకు కారణం కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్యపై పురుషులు మరింత అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రాణాంతమైన ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అనురాగ్ కుమార్ దీనిపై స్పందించారు. ‘మూత్ర విసర్జన సమస్యకు డయాబెటిస్‌ కారణమని అందరూ భావిస్తారు అయితే ప్రతి సందర్భంలోనూ ఇది డయాబెటిస్ కాదు. మెడికల్ జర్నల్ ద లాన్సెట్ పరిశోధనల ప్రకారం, మూత్ర విసర్జన కూడా ప్రోస్టేట్ క్యాన్సర్‌కు కారణమయ్యే విస్తారిత ప్రోస్టేట్ లక్షణం కావచ్చని చెప్తున్నారు. 2వేల మంది రోగులపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తరచుగా మూత్ర విసర్జన చేసే వారిలో మధుమేహం సమస్య లేకుంటే సదరు వ్యక్తి పీఎఫ్‌ఏ పరీక్ష చేయించుకోవాలి’ అని ఆయన సూచించారు. పురుషుల్లో వచ్చే క్యాన్సర్స్‌లో ఇది రెండో ప్రధానమైనది. వయస్సు పెరుగుతున్నా కొద్దీ దీని భారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రొస్టేట్ క్యాన్సర్‌ లక్షణాలు..
మూత్ర విసర్జనలో ఇబ్బందిగా ఉన్నా.. తరచుగా మూత్ర విసర్జన చేయవలసిన అవసరం ఉన్నట్లు అనిపిస్తుంది. మూత్రంలో రక్తం రావడం కూడా ఈ క్యాన్సర్‌ లక్షణంగా చెప్పవచ్చు. వయస్సు పెరుగుతున్నా కొద్దీ ఈ లక్షణాలపై శ్రద్ధ చూపడం ముఖ్యం. ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్‌ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ లక్షణాలు చివరిదశలో బయటపడతాయి. 40 ఏళ్లు దాటిన వారిలో ఇలాంటి సమస్య వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయద్దని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

నోట్ : ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏ చిన్న అనారోగ్య సమస్య ఎదురైనా వెంటనే వైద్యులను కలిసి వారి సలహాలు తీసుకోవడం అతి ముఖ్యం.

TAGS