Urban Bank : ఓ లాయర్ బీజేపీ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. లఖింపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవదేశ్ సింగ్ స్థానిక ఎమ్మెల్యే యోగేష్ వర్మపై నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డాడు. ఎదురుగా వెళ్లిన అవదేశ్ సింగ్ పోలీసులు అడ్డుకునే లోపే ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు సైతం ఎమ్మెల్యేపై దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలో జరగనున్న అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ మేనేజ్ మెంట్ కమిటీ ఎన్నికల విషయంలో ఇరువర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ కమిటీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎమ్మెల్యే యోగేష్ లేఖ రాయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు నామినేషన్ దాఖలు సందర్భంగా ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.