Upasana : హీరోయిన్లతో రామ్ చరణ్ ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ గురించి స్పందించిన ఉపాసన.. ఏమన్నదంటే..?

Upasana reacts about Ram Charan’s on-screen chemistry
Upasana : ఉపాసన కొణిదెల గురించి పరిచయం అవసరం లేదు. అపోలో హాస్పిటల్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె రామ్ చరణ్ ను వివాహం చేసుకొని ఇటీవల ఒక పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఉపాసన ఎప్పుడూ కాన్ఫిడెంట్ పర్సన్ అని, ఆమె ఎప్పుడు మాట్లాడినా వినడం ఆసక్తికరంగా ఉంటుంది.
గతంలో తనతో రామ్ చరణ్ లవ్ మ్యాటర్ గురించి అందరినీ ఆశ్చర్య పరిచింది. రామ్ చరణ్ తాను కలిసే చదువుకున్నట్లు చెప్పిన ఆమె ఆ సమయంలోనే మా మధ్య లవ్ చిగురించిందని చెప్పింది. అప్పటి ఇప్పటి వరకు మా జర్నీ చాలా ఇంట్రస్టింగ్ గా సాగిందన్న ఆమె ఇటీవల మా కలల పంట క్లిన్ కారా వచ్చిన తర్వాత మరింత ఆనందంగా మారింది అని చెప్పింది.
రీసెంట్ గా ఒక వెబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన రామ్ చరణ్ హీరోయిన్స్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి చర్చించిన చిన్న క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యాంకర్ రామ్ చరణ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అడిగితే ఉపాసన సమాధానం చెప్పడానికి నిరాకరించింది. యాంకర్ మరీ ఒత్తిడి చేయడంతో కొంచెం వరకైనా మాట్లాడక తప్పలేదు.
కాజల్ రామ్ చరణ్ ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ గురించి యాంకర్ అడుగగా.. ఉపాసన కలగ జేసుకొని ఒక్క కాజలే ఎందుకు కియారా, ఆలియా, ప్రియాంకతో పాటు రంగస్థలంలో చరణ్ తో కలిసి నటించిన సమంత పేర్లను కూడా ప్రస్తావించింది. ఇది ఒక సరదా వీడియో క్లిప్, ఆమె మాట్లాడడం చూస్తే రామ్ చరణ్ విషయంలో ఆమె ఎంత పొసెసివ్ గా ఉందో తెలుస్తుంది.