JAISW News Telugu

Upasana-Ramcharan : చెల్లి కూతుళ్ల బారసాలలో ఉపాసన.. రామ్ చరణ్ తో వచ్చి ఏం చేసిందంటే?

Upasana-Ramcharan

Upasana-Ramcharan

Upasana-Ramcharan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల తన ఫాలోవర్లను ఒక్కసారిగా ఆనందానికి గురి చేశారు. తన చెల్లెలు అనూష్ పాలా, ఆమె భర్త అర్మాన్ ఇబ్రహీంకు కవల కూతుళ్లు జన్మించారు. ఈ విషయాన్ని ఆమె తన ఫాలోవర్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఆమె పోస్ట్ చేసిన ఫొటోల్లో కుటుంబం అంతా గుమిగూడి ఒక చోట ఉండడం చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ వారి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఉపాసన పోస్ట్ చేసిన ఒక ఫొటోలో రామ్ చరణ్ తమ మెగా ప్రిన్స్ క్లీన్ కారాను పట్టుకొని, ఉత్సాహంగా ఆనందంగా కనిపిస్తున్నాడు. కాగా ఉపాసన చెల్లి, మరిది తల్లిదండ్రులుగా మారిన అనూష్ పాలా, అర్మాన్ ఇబ్రహీం తమ కూతుళ్లను ఎత్తుకొని ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ సన్నివేశం ఆప్యాయత, అనురాగంతో నిండి ఉంది. ఇది మొత్తం కుటుంబానికి నిజంగా ఆనందించాల్సిన సమయం.

ఉపాసన తన క్యాప్షన్ లో తన చెల్లెలికి పుట్టిన నవజాత శిశువులను ‘అద్భుతమైన త్రీసమ్ – పవర్ పఫ్ గర్ల్స్’ అని పరిచయం చేసింది. కుటుంబ సభ్యులందరూ సొగసైన సంప్రదాయ దుస్తులు ధరించి, తమ సంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించారు. ఇది మరింత శోభను తెచ్చిపెట్టింది. ఉపాసన తన భర్త రామ్ చరణ్ కూతురు క్లిన్ కారాతో కలిసి ఎక్కువగా ఫంక్షన్లకు అటెండ్ కాలేదు. కానీ దైవ కార్యక్రమాలకు మాత్రం ఎక్కువగా అటెండ్ అయ్యింది. పూజలు చేస్తూ కనిపించిన ఆమె పిక్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Exit mobile version