JAISW News Telugu

Madrasa Act : యూపీ మదర్సా చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు

Madrasa Act

Madrasa Act

Madrasa Act : యూపీ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం రాజ్యాంగబద్ధమేనని నేడు (మంగళవారం) సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ చట్టాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం, గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. దీంతో ఉత్తరప్రదేశ్ లో వేల సంఖ్యలో ఉన్న మదర్సాలకు భారీ ఊరట లభించింది.

ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు దానిని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అది లౌకికవాద భావనకు విరుద్ధమైనదని ఆ సందర్భంగా తెలిపింది. దాంతో ఆ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఇది రాజ్యాంగ విరుద్ధమటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని తెలిపింది. ఈ తీర్పు 10 వేల మదర్సా టీచర్లు, 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపైనా ప్రభావం చూపుతోందని అప్పట్లో పేర్కొంది. ప్రస్తుత తీర్పుతో 16 వేల మదర్సాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి.

Exit mobile version