YCP Leaders : కనిపించని వైసీపీ మాటల పోటుగాళ్లు.. సన్మాలు చేసేందుకు ఫ్యాన్స్ వెయిటింగ్?
YCP Leaders : పని ఎక్కువ మాటలు తక్కువ ఉంటేనే వారు వృద్ధిలోకి వస్తారన్న సామెత బహూషా వైసీపీలోని కొంత మంది నాయకులకు తెలియకపోవచ్చు. జగన్ ఐదేళ్ల పాలనలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు, ఎప్పుడు చూసినా నోటి దురుసుతో వ్యవహరించేవారు. మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు, లేదంటే బాబు కొడుకు లోకేశ్, ఆయన కాదంటే పవన్ కళ్యాణ్ గురించి ఇష్టం వచ్చిన్నట్లు వాగుతుండేవారు.
నోటి దురుసు ఎక్కువగా ఉన్న వారిలో ఫస్ట్ ప్లేస్ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అని చెప్పుకోక తప్పదు. వైసీపీ ప్రభుత్వంలో శాసన సభలో చంద్రబాబును అవమానిస్తుంటే సీఎం హోదాలో ఉన్న జగన్ వారించకపోగా ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆవు చేనులో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు బల్లలు చరిచి మరీ హర్షం వ్యక్తం చేశారు.
నాడు పదవీ, అధికారం, జగన్ అండ చూసుకొని పెట్రేగిన నాని గొంతు ఇప్పుడు వినిపించడంలేదు. ఇక ఆయనకు లోకేశ్ సత్కారం చేస్తానని కూడా ప్రకటించారు. దాని కోసం తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా, సీదిరి అప్పలరాజు, ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, కేశినేని నాని, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ వీరితో పాటు చాలా మందే ఉన్నారు.
అధికారం శాశ్వతం అన్నట్లుగా నాడు రెచ్చిపోయి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు. కానీ ఇప్పుడు నోరు విప్పడం లేదు సరికదా.. హఠాత్తుగా మాయం అయిపోయారు. దీంతో వీరంతా ఎక్కడని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
ఇక సినిమా వారిని పరిశీలిస్తే.. పోసాని కృష్ణ మురళి, అలీ ఇద్దరూ మంచి నటులే పోసాని వైసీపీలో చేరాక రెచ్చిపోయి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను నోటికి వచ్చిన్నట్లు తిట్టారు. అలీ వైసీపీలో ఉన్నా ఏనాడూ నోరు జారలేదు. మీడియా ముందుకే రాలేదు. రాంగోపాల్ వర్మ కూడా చంద్రబాబు, టీడీపీ, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో చాలా రెచ్చిపోయేవారు. కానీ ఇప్పుడు వర్మ, పోసాని కనిపించడం లేదు.
ప్రజలు అధికారం అప్పగించినప్పుడు బుద్ధిగా పాలన చేసుకోవాలి. పెద్దలను గౌరవించాలి, వారిని పాలనా పరంగా ఇరుకునపెట్టి అనుకున్నవి సాధించుకోవాలి. కానీ నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే మంచిది కాదు. ఇలా ఈ రోజు వైసీపీకి ఇన్నికష్టాలు ఉండేవి కాదు.