Minister Lokesh : అమెరికాలో మంత్రి లోకేశ్ కు అపూర్వ స్వాగతం

Minister Lokesh
Minister Lokesh : ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు అమెరికా వెళ్లిన మంత్రి నారా లోకేశ్ కు శాన్ ఫ్రాన్సిస్కోలో అపూర్వ స్వాగతం లభించింది. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో మంత్రి లోకేశ్ కు స్వాగతం పలికేందుకు టీడీపీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేశ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్టోబరు 25 నుంచి నవంబరు 1వ తేదీ వరకు మంత్రి లోకేశ్ అమెరికాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 29న లాస్ వేగాస్ నగరంలో జరగనున్న ‘ఐటీ సర్వీస్ సినర్జీ’ 9వ సదస్సుకు హాజరుకానున్నారు. 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన అన్న ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కో-ఆర్డినేటర్ జయరాం కోమటి, ఎన్నారై టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, స్థానిక టీడీపీ నేతలు శశి దొప్పలపూడి, శ్రీకాంత్ దొడ్డపనేని, టీడీపీ జోనల్ ఇంచార్జి రవి మందలపు, ఐటీ సర్వ్ ప్రతినిధులు వినోద్ ఉప్పు, సతీశ్ మండవ, సురేశ్ మానుకొండ ఎయిర్ పోర్టులో మంత్రి లోకేశ్ కు ఘన స్వాగతం పలికినవారిలో ఉన్నారు.