JAISW News Telugu

Major Radhika Sen : రాధిక సేన్ కు ఐక్యరాజ్య సమితి అవార్డు

Major Radhika Sen

Major Radhika Sen

Major Radhika Sen : డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్య సమితి (UN) మిషన్‌లో పనిచేసిన భారతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్‌ను సైనిక అవార్డుతో సత్కరించనున్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆమెని ప్రశంసించారు. ఆమెను నిజమైన, ఆదర్శవంతమైన నాయకురాలిగా అభివర్ణించారు. మే 30న అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దినోత్సవం సందర్భంగా మేజర్ రాధికా సేన్‌కు 2023 “యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్” అవార్డు ఇవ్వనున్నారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ ఆమెను ఈ అవార్డుతో సత్కరించనున్నారు.

విధి నిర్వహణలో బలిదానం చేసిన శాంతి రక్షకులకు ‘అంతర్జాతీయ ఐరాస శాంతి రక్షకుల దినోత్సవం’ సందర్బంగా ఈ నెల 30న డ్యాగ్ హామర్ షోల్డ్ పతకాలను ప్రదానం చేయనున్నట్లు సమితి ప్రకటించింది. ఈ పతకాలను పొందే 64 మంది సైనిక, పోలీసు, పౌర శాంతి రక్షకులలో భారతీయ జవాన్, దివంగ నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు. ఆయన సమితి శాంతిరక్షక సేన సభ్యుడిగా కాంగోలో విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేశారు.

Exit mobile version